ఉదయం రద్దీ.. మధ్యాహ్నం నుంచి నిర్మానుష్యం

ABN , First Publish Date - 2021-05-07T05:05:13+05:30 IST

గోపాలపట్నంలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలు అవుతోంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్‌లకు రద్దీ పెరిగింది.

ఉదయం రద్దీ.. మధ్యాహ్నం నుంచి నిర్మానుష్యం
ఉదయం రద్దీగా ఉన్న పెందుర్తి రైతుబజారు

కర్ఫ్యూ పకడ్బందీగా అమలు

ఉదయం వేళ దుకాణాలు, రైతుబజార్లకు పోటెత్తుతున్న జనం

కొన్ని చోట్ల భౌతిక దూరం పాటించని వైనం

మధ్యాహ్నం నుంచి రోడ్లన్నీ ఖాళీ


గోపాలపట్నం, మే 6: గోపాలపట్నంలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలు అవుతోంది. ఉదయం 6  నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్‌లకు రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌ ముగిసే సమయం వరకు ప్రధాన రహదారిలోని దుకాణ సముదాయాలు, మార్కెట్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నా మార్కెట్‌లలో మాత్రం రద్దీ తగ్గడం లేదు. ఈ నెలలో పెళ్లిళ్లు కూడా అధికంగా ఉండడంతో ముందుగా ముహూర్తాలు పెట్టుకున్నవారు పెళ్లి దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి వస్తుండడంతో షాపింగ్‌ మాల్స్‌ కిటకిటలాడుతున్నాయి. 

రైతుబజారులో రద్దీ

పెందుర్తి: కర్ఫ్యూ నేపథ్యంలో పెందుర్తి రైతుబజారు గురువారం ఉదయం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. జనం భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ కూరగాయలు కొనుగోలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మధ్యాహ్నం 12 నుంచి ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. ప్రధాన రహదారులు కూడా బోసిపోయాయి.



Updated Date - 2021-05-07T05:05:13+05:30 IST