Advertisement

'మోసగాళ్లు' వచ్చేస్తున్నారు

Mar 7 2021 @ 15:33PM

'ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ' వంటి హిట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు తాజాగా నటిస్తోన్న చిత్రం 'మోసగాళ్లు'. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్‌, సునీల్ శెట్టి ముఖ్య పాత్రదారులుగా నటించిన ఈ చిత్రాన్ని విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మించారు. ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తేదీని చిత్రయూనిట్‌ ప్రకటించింది. మార్చి 19న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 'మోసగాళ్లు' విడుదల కానున్నట్లు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. 

 
Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.