పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

ABN , First Publish Date - 2020-11-28T03:55:13+05:30 IST

ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు. సన్నిహితంగా మెలిగాడు. ఇప్పుడు గర్భవతి కావడంతో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..



బాలికను గర్భవతి చేసిన యువకుడు

దత్తిరాజేరు, నవంబరు 27:

ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు. సన్నిహితంగా మెలిగాడు. ఇప్పుడు గర్భవతి కావడంతో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దత్తిరాజేరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన. గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్‌ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది.  బాధిత కుటుంబసభ్యులు ఆమెను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌.బూర్జివలస ఎస్‌ఐ బి.భాగ్యం తెలిపారు. 



Updated Date - 2020-11-28T03:55:13+05:30 IST