UAE Jobs: కొత్త ఉద్యోగుల వేటలో యూఏఈ కంపెనీలు.. అక్కడ డిమాండ్ ఉన్న టాప్ జాబ్స్ ఇవే..

ABN , First Publish Date - 2022-09-14T14:26:44+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని దాదాపు 70 శాతం కంపెనీలు వచ్చే ఏడాది కోసం కొత్త ఉద్యోగుల వేటలో ఉన్నట్లు జాబ్ పోర్టల్ Bayt.com (YouGov) సర్వేలో తేలింది. వీటిలో వచ్చే మూడు నెలల్లో 50 శాతం కంపెనీలు గరిష్టంగా ఐదు రకాల ఉద్యోగాల (Jobs) కోసం నియామకాలు చేపట్టనున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. అలాగే 25 శాతం కంపెనీలు ఆరు..

UAE Jobs: కొత్త ఉద్యోగుల వేటలో యూఏఈ కంపెనీలు.. అక్కడ డిమాండ్ ఉన్న టాప్ జాబ్స్ ఇవే..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని దాదాపు 70 శాతం కంపెనీలు వచ్చే ఏడాది కోసం కొత్త ఉద్యోగుల వేటలో ఉన్నట్లు జాబ్ పోర్టల్ Bayt.com (YouGov) సర్వేలో తేలింది. వీటిలో వచ్చే మూడు నెలల్లో 50 శాతం కంపెనీలు గరిష్టంగా ఐదు రకాల ఉద్యోగాల (Jobs) కోసం నియామకాలు చేపట్టనున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. అలాగే 25 శాతం కంపెనీలు ఆరు నుంచి పది మంది కార్మికులను నియమించుకోనున్నట్లు సర్వే పేర్కొంది. ఇక అక్కడ డిమాండ్ ఉన్న టాప్ జాబ్స్ విషయానికి వస్తే.. సేల్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ అని సర్వే రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఈ మూడు పోస్టుల కోసం అక్కడి కంపెనీలు వచ్చే మూడు నెలల్లో భారీ మొత్తంలో నియామకాలు చేపట్టనున్నాయని సర్వే తేల్చి చెప్పింది. 


కాగా, 2022 జూన్ 9 నుండి ఆగస్టు 1వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో యూఏఈ, సౌదీ అరేబియా, కువైత్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, పాలస్తీనా, సిరియా, ఈజిప్ట్, మొరాకో, అల్జీరియా, మెనా, ట్యునీషియా, లిబియా, సూడాన్‌లోని ప్రధాన జాబ్ మార్కెట్‌లు ఉన్నాయి. ఇదిలాఉంటే.. మహమ్మారి కరోనా తర్వాత యూఏఈలో జాబ్ మార్కెట్ బాగా కోలుకుంది. దీంతో భారీ మొత్తంలో కొత్త నియామకాలు జరుగుతున్నరట్లు సర్వే వెల్లడించింది. యూఆర్‌బీ (URB) కొత్తగా ప్రారంభించిన దుబాయ్ అర్బన్ టెక్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ద్వారా 4,000 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.


ఇక బేట్ సర్వే ప్రకారం.. నైపుణ్యాల పరంగా చూసుకుంటే యూఏఈ కంపెనీ యజమానుల్లో 51 శాతం మంది అభ్యర్థులలో అరబిక్, ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారి కోసం చూస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత మంచి టీమ్ లీడర్, నాయకత్వ నైపుణ్యాలు, ఒత్తిడిలోనూ పని చేసే సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారట. అలాగే అనుభవం విషయానికొస్తే.. 28 శాతం మంది నిర్వాహక అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. 27 శాతం మంది సేల్స్, మార్కెటింగ్ అనుభవం ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. 29 శాతం మంది మిడ్-లెవల్ అనుభవం ఉన్న అభ్యర్థులను కోరుకుంటున్నారు. కాగా, ఇక్కడి కంపెనీల యజమానులలో చాలా మంది అభ్యర్థులకు సంబంధించి కోరుకునే విద్యా అర్హతలలో వ్యాపార నిర్వహణ (Business management), ఇంజనీరింగ్ (Engineering), కామర్స్(Commerce) ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఈ విద్యా అర్హతలు గల నివాసితులు, ప్రవాసులకు యూఏఈలో భారీ డిమాండ్ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 


Updated Date - 2022-09-14T14:26:44+05:30 IST