ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులు జాబితా ఇదే.. దుబాయి రాజు మాత్రమే కాదండోయ్..!

ABN , First Publish Date - 2021-12-22T22:05:36+05:30 IST

దుబాయి రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ విడాకుల కేసులో యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులు జాబితా ఇదే.. దుబాయి రాజు మాత్రమే కాదండోయ్..!

దుబాయి రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ విడాకుల కేసులో యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మొహమ్మద్ బిన్ రషీద్ తన ఆరో భార్య ప్రిన్సెస్‌ హయాకు భరణంగా 550 మిలియన్‌ పౌండ్ల (సుమారు రూ. 5,500 కోట్లు)కు పైగానే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బ్రిటన్‌ చరిత్రలోనే అతి పెద్ద విడాకుల కేసుగా ఇది నిలిచింది. దుబాయి రాజు కంటే భారీగా కొందరు సెలబ్రిటీలు తమ భార్యలకు భారీ మొత్తాలు భరణంగా సమర్పించుకున్నారు.. ఆ జాబితా ఒకసారి పరిశీలిస్తే.. 


జెఫ్ బెజోస్-మాకెంజీ స్కాట్


అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 2019లో తన భార్య మాకెంజీ స్కాట్ నుంచి విడిపోవడం సంచలనం సృష్టించింది. ఒకప్పటి సహోద్యోగిణి, తర్వాత భార్య అయిన మెకెంజీకి బెజోస్ భారీ మొత్తం విడాకుల భరణంగా చెల్లించారు. బెజోస్ నుంచి విడాకులు తీసుకున్నందుకు స్కాట్ 38 బిలియన్ డాల‌ర్ల (రూ. 28 లక్షల కోట్లు) మొత్తాన్ని అందుకుంది. ఆ మొత్తంతో ఈమె ప్రపంచంలోనే మూడవ సంపన్న మహిళగా నిలిచింది.


బిల్‌ -మిలిందా గేట్స్‌


27 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం గడిపిన బిల్ గేట్స్, మిలిందా ఈ ఏడాది విడిపోయారు. ప్రస్తుతం వీరి ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఉమ్మడి ఆస్తులను పంచుకోవాలని భావిస్తున్నట్టు కింగ్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టులో దాఖలు చేసిన విడాకుల ఒప్పంద పత్రంలో బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ పేర్కొన్నారు. భరణంగా మిలిందాకు దాదాపు 80 బిలియన్ డాలర్లు (రూ.60 లక్షల కోట్లు) దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిలిందా అత్యంత సంపన్న మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


దిమిత్రి రైబోలోలెవ్‌- ఎలీనా రైబోలోలెవ్


రష్యా బిలియనీర్ దిమిత్రి రైబోలోలెవ్, ఆయన భార్య, వ్యాపారవేత్త ఎలీనా విడాకుల భరణం ఎన్నో ఏళ్ల పాటు ఖరీదైన సెటిల్మెంట్‌గా నిలిచింది. 26 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 2014లో వీరిద్దరూ విడిపోయారు. ఆ సమయంలో ఎలీనాకు దాదాపు 4.5 బిలియన్‌ డాలర్లు (రూ.3.4 లక్షల కోట్లు) భరణంగా లభించాయి.


ఎలిక్‌ వైల్డెన్‌స్టీన్‌- జోక్లిన్‌ వైల్డెన్‌స్టీన్


ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్‌ ఆర్ట్ డీలర్ ఎలిక్, 1999లో తన భార్య జోక్లిన్ నుంచి విడిపోయారు. ఆ సందర్భంగా ఆమెకు 3.8 బిలియన్‌ డాలర్లు (రూ.2.8 లక్షల కోట్లు) భరణం రూపంలో చెల్లించారు.


రూపర్ట్ మర్దోక్- అన్నా మర్దోక్


అమెరికన్‌ మీడియా మెఘల్‌ రూపర్ట్‌ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెబుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్లు (రూ.1.2 లక్షల కోట్లు) భరణంగా చెల్లించారు.


మైకేల్ జోర్డాన్-జౌనిత జోర్డాన్


బాస్కెట్ బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్, అతని భార్య జౌనిత్ 17 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 2006లో విడిపోయారు. దీంతో మైకేల్ నుంచి జౌనితకు 168 మిలియన్ డాలర్లు (రూ.12 వేల కోట్లు) భరణంగా దక్కాయి.


అద్నాన్-సొరాయ ఖషోగ్గి


సౌదీ బిలియనీర్ అద్నాన్ ఖషోగ్గి 1982లో తన భార్య సొరాయ నుంచి విడిపోయారు. ఆ సమయంలో తన భార్యాకు 66 వేల కోట్ల రూపాయలు భరణంగా చెల్లించారు. 


స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌- ఎమీ ఇర్వింగ్‌


ప్రముఖ హాలీవుడ్‌  దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్‌ డాలర్లు (రూ.755 కోట్లు) ఎమీకి భరణంగా చెల్లించారు.


Updated Date - 2021-12-22T22:05:36+05:30 IST