ఈ ప్రదేశాలంటే అక్కడి వారికి హడల్.. రాత్రైతే చాలు అటువైపు కన్నెత్తికూడా చూడరు!

ABN , First Publish Date - 2022-06-03T14:36:05+05:30 IST

ఈ ప్రపంచం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. భూమి మీద మనుషులతోపాటు దయ్యాలు కూడా ఉన్నాయని కొందరు గట్టిగా నమ్మితే.. మరికొందరేమో దీన్ని కొట్టిపారేస్తారు. ఈ క్రమంలోనే మొదటి వర్గానికి చెందిన వాళ్లు భూమిపై కొ

ఈ ప్రదేశాలంటే అక్కడి వారికి హడల్.. రాత్రైతే చాలు అటువైపు కన్నెత్తికూడా చూడరు!

ఇంటర్నెట్ డెస్క్: ఈ ప్రపంచం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. భూమి మీద మనుషులతోపాటు దయ్యాలు కూడా ఉన్నాయని కొందరు గట్టిగా నమ్మితే.. మరికొందరేమో దీన్ని కొట్టిపారేస్తారు. ఈ క్రమంలోనే మొదటి వర్గానికి చెందిన వాళ్లు  భూమిపై కొన్ని ప్రదేశాలు దయ్యాలకు నిలయంగా   మారాయని భావిస్తున్నారు. కాగా.. ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే అంశంపై ఓ లుక్కేస్తే..



అగ్రరాజ్యం అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న The Myrtless St. Francisville అనే హిస్టారిక్ భవనంలో దయ్యాలు తిరుగుతాయని స్థానికులు బలంగా నమ్ముతారు. ఇద్దరు పిల్లల ఆత్మలు బిల్డింగ్ వరండాలో తిరుగుతుండగా పలు మార్లు చూసినట్లు స్థానికులు చెబుతారు. ఇదే సమయంలో సుమారు 10 మంది ఇక్కడ అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో నిర్ణీత సమయాల్లో  స్థానికులు అటువైపు వెళ్లాలంటే కూడా హడలిపోతారు.





ఈ జాబితాలో సింగపూర్‌లోని Bishan MRT station కూడా ఉంది. Bishan MRT station‌ను ఓ స్మశానవాటికలో నిర్మించారు. దీన్ని 1987లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రయాణికులు ఇక్కడ వింత ఘటనలను ఎదుర్కొన్నారని స్థానికులు చెబుతారు. కాళ్లు, చేతులు, తలలేని మొండాలు కనిపించడంతో కొందరు ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా రైలుపై ఎవరో నడిచినట్లు వింత శబ్దాలు వినిపిస్తాయని ఇక్కడ ప్రజలు పేర్కొంటున్నారు. 


రొమానియాలో ఉన్న Lulia Hasdeau House కూడా దయ్యాలకు నిలయం అని అక్కడి ప్రజలు భావిస్తారు. లూలియా అనే వ్యక్తి చినిపోయిన తన కూతురి జ్ఞాపకార్థం ఈ ఇంటిని నిర్మించాడని.. ఆ తర్వాత అతడు ఆమె ఆత్మతో మాట్లాడేవాడని స్థానికులు చెబుతారు. 



మెక్సికోకు 17మైళ్ల దూరంలో ఉన్న డాల్స్ ఐలాండ్‌‌లో కూడా దయ్యాలు తిరుగుతాయనే నానుడి ఉంది. పాడైపోయిన బొమ్మలు ఈ ఐలాండ్‌లోని చెట్లకు వేలాడుతూ ఉంటాయి. ఇక్కడ అతీత శక్తులు ఉన్నాయని.. రాత్రి సమయంలో ఇక్కడ నుంచి రకరకాల శబ్దాలు వస్తాయనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ  ప్రదేశంలో అడుగుపెట్టేందుకు ఎవ్వరూ సాహసించరు. 



మరి ఇలాంటి ప్రదేశాలు ఇండియాలో లేవా అంటే.. మన దేశంలో కూడా ఓ ప్రదేశం ఉంది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న Bhangarh Fort దయ్యాలు తిరిగే ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే పగటి వేళ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రదేశం.. సాయంత్రం వేళ నుంచి మూగబోతుంది.  


Updated Date - 2022-06-03T14:36:05+05:30 IST