అది అతిపెద్ద విస్కీ బాటిల్... ఎంతకు అమ్ముడయ్యిందంటే...

ABN , First Publish Date - 2022-05-30T17:32:38+05:30 IST

ప్రపంచంలో మద్యం బాటిళ్ల గురించి ఎక్కడో ఒకచోట...

అది అతిపెద్ద విస్కీ బాటిల్... ఎంతకు అమ్ముడయ్యిందంటే...

ప్రపంచంలో మద్యం బాటిళ్ల గురించి ఎక్కడో ఒకచోట చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒక విస్కీ బాటిల్ వేలంపాట హెడ్‌లైన్స్‌లో నిలిచింది. వేలంలో దీని ధర కోట్లలో పలికింది. ఈ మద్యం సీసాలో లీటరు ప్రకారం కాకుండా గ్యాలన్ ప్రకారం మద్యం నింపాల్సివుంటుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ బాటిల్‌లో 86 గ్యాలన్ల వరకు ఆల్కహాల్ నింపవచ్చు. 


ఒక గ్యాలన్ అంటే 4.5 లీటర్లు. 86 గ్యాలన్ల కెపాసిటీ ఉన్న ఈ సీసాలో 363 లీటర్ల మద్యం పడుతుంది. ఈ బాటిల్ 444 స్టాండర్డ్ సైజ్ బాటిల్‌తో సమానమని చెబుతున్నారు. ఈ సీసా సుమారు 6 అడుగుల పొడవు కలిగివుంది. ఇంత పెద్ద బాటిల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ బాటిల్ దాదాపు 32 ఏళ్ల నాటిది. ఈ విస్కీ బాటిల్ పేరు ది ఇంట్రెపిడ్. ఈ బాటిల్‌ను మే 25న వేలం వేయగా 1.4 మిలియన్ డాలర్లకు అంటే 10 కోట్ల రూపాయలకు విక్రయమయ్యింది. 


Updated Date - 2022-05-30T17:32:38+05:30 IST