పోలీసుల అతి.. సిబ్బంది చెత్త పని

ABN , First Publish Date - 2022-03-17T07:30:20+05:30 IST

పోలీసుల అతి.. సిబ్బంది చెత్త పని

పోలీసుల అతి.. సిబ్బంది చెత్త పని

ఏఐవైఎఫ్‌ నేతలను చితకబాది... 

విద్యార్థి నేతలను లాకప్‌లో తోసి..

కర్నూలు, అనంతల్లో లాఠిన్యం

చెత్తపన్ను వసూలు కోసం

కర్నూలులో అడ్డగోలు పని

వాణిజ్య సముదాయం ముందు

చెత్త పోసిన కార్పొరేషన్‌ సిబ్బంది

తెచ్చి మరీపోశారు


పోలీసుల వైఖరికి అద్దం పడుతున్న రెండు సంఘటనలివి. ‘మేం ఒకరిని అరెస్టు చేసేందుకు వెళితే ప్రశ్నిస్తారా!’ అంటూ రెచ్చిపోయారు. కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన ఇద్దరు ఏఐవైఎఫ్‌ నేతలపై కేసు పెట్టి, చితకబాదారు. ఇక... అనంతపురంలో విద్యార్థి సమస్యలపై ఆందోళనకు దిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నేతలను ఏకంగా లాకప్‌లో పడేశారు. 


చెత్త పన్ను చెల్లించడం లేదంటూ కర్నూలు నగరపాలక సిబ్బంది ‘చెత్తపని’ చేశారు. నగరంలోని అనంత కాంప్లెక్స్‌-1లోని వస్త్ర దుకాణాల ముందు బుధవారం ఉదయం  చెత్త తెచ్చి పోశారు.  కరోనాతో రెండేళ్లుగా కష్టాలు పడుతున్నామని...   అన్ని పన్నులు కడుతున్నా, కొత్తగా చెత్తపన్ను కట్టాలని ఒత్తిడి తేవడం తగదని వ్యాపారులు వాపోయారు. దీనిపై 

కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లినా పట్టించుకోలేదన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా చెత్తను తొలగించలేదు. పైగా...  పన్ను కట్టకపోతే గురువారం ఉదయం మరింత చెత్తతెచ్చి పోస్తామని అధికారులు హెచ్చరించడం కొసమెరుపు!

- కర్నూలు అర్బన్‌



Updated Date - 2022-03-17T07:30:20+05:30 IST