వామ్మో.. ఫాలోవర్ల కోసం యూట్యూబర్ సాహసం.. 50 గంటలపాటు సమాధిలోనే.. రికార్డు సృష్టించిన వీడియో..

ABN , First Publish Date - 2021-12-11T23:09:06+05:30 IST

ఫాలోవర్ల కోసం ఎవ్వరూ చేయలేని పనికి అతడు సిద్ధపడ్డాడు. ఏకంగా 50 గంటలపాటు సమాధిలో గడిపాడు. తన అనుభవాలను కెమెరాలో బంధించి.. ప్రపంచం ముగ్గిట పెట్టాడు. దీంతో ఆ వీడియో రికార్డు సృష్టిం

వామ్మో.. ఫాలోవర్ల కోసం యూట్యూబర్ సాహసం.. 50 గంటలపాటు సమాధిలోనే.. రికార్డు సృష్టించిన వీడియో..

ఇంటర్నెట్ డెస్క్: ఫాలోవర్ల కోసం ఎవ్వరూ చేయలేని పనికి అతడు సిద్ధపడ్డాడు. ఏకంగా 50 గంటలపాటు సమాధిలో గడిపాడు. తన అనుభవాలను కెమెరాలో బంధించి.. ప్రపంచం ముగ్గిట పెట్టాడు. దీంతో ఆ వీడియో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన వీడియోల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్‌సన్ కొన్నేళ్ల క్రితం.. ‘మిస్టర్‌బీస్ట్‌’ పేరుతో య్యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ క్రమంలో తన వీడియోలతో 84 మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుని, ప్రముఖ యూట్యూబర్‌గా గుర్తింపు పొందాడు. కాగా.. తన ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేయడం కోసం జిమ్మీ.. ఎవరూ కలలో కూడా ఊహించని పనికి సిద్ధపడ్డాడు. శవపేటికలో పడుకున్న తర్వాత ఆ శవ పేటికను గోతిలో పూడ్చిపెట్టమని తన సహచరులకు తెలిపాడు. దీంతో అతడి సహచరులు కూడా జిమ్మి చెప్పిన విధంగా చేసేశారు. 



ఈ క్రమంలో జిమ్మి.. ఏకంగా 50 గంటలపాటు సమాధిలో గడిపి తన అనుభవాలను ముందుగానే సెటప్ చేసుకున్న కెమెరాలో రికార్డు చేశాడు. తర్వాత సమాధిలోంచి బయటికొచ్చిన జిమ్మి ఆ వీడియోను ‘I Spent 50 Hours Buried Alive’ టైటిల్‌తో ఈ ఏడాది మార్చి 28న యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. డిసెంబర్ 10వ తేదీ వరకూ ఆ వీడియోను 151.7 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో ఈ ఏడాది యూట్యూబ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన వీడియోల జాబితాలో తొలిస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. 






Updated Date - 2021-12-11T23:09:06+05:30 IST