తనయుల చెంతకు తల్లి

ABN , First Publish Date - 2021-04-24T05:00:46+05:30 IST

భర్తను పోగొట్టుకున్న బాధలో మతిస్థిమితం కోల్పోయింది. ఉన్న ఊరును, కన్న పిల్లలను వదిలి రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చింది. ఇక్కడ దయనీయ స్థితిలో జీవనం సాగిస్తోంది. ఆమె దుస్థితిని చూసి చలించిన అన్నం శ్రీనివాసరావు తన ఆశ్రమానికి తీసుకెళ్లి సపర్యలు చేసి మాములు మనిషిని చేశారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు అప్పగించారు.

తనయుల చెంతకు తల్లి
ఏఎస్పీ సమక్షంలో పోలీసులకు అప్పగిస్తున్న దృశ్యం

పేగుబంధాన్ని కలిపిన అన్నం ఫౌండేషన్‌

ఏఎస్పీ సమక్షంలో కుటుంబసభ్యులకు అప్పగింత

భద్రాచలం, ఏప్రిల్‌ 23: భర్తను పోగొట్టుకున్న బాధలో మతిస్థిమితం కోల్పోయింది. ఉన్న ఊరును, కన్న పిల్లలను వదిలి రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చింది. ఇక్కడ దయనీయ స్థితిలో జీవనం సాగిస్తోంది. ఆమె దుస్థితిని చూసి చలించిన అన్నం శ్రీనివాసరావు తన ఆశ్రమానికి తీసుకెళ్లి సపర్యలు చేసి మాములు మనిషిని చేశారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. 

పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి..

మతిస్థితిమితం కోల్పోయి భద్రాచలంలోని రోడ్ల పక్కనే దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్న శాంతిదేవి అనే మహిళను శుక్రవారం ఆమె కుమారుడి చెంతకు చేర్చి ఆమెకు తిరిగి కొత్తజీవితాన్ని ప్రసాదిం చింది ఖమ్మానికి చెందిన అన్నం ఫౌండేషన్‌. భద్రాచలానికి పదేళ్ల క్రితం వచ్చి బ్రిడ్జి రోడ్డు, అంబేద్కర్‌ సెంటర్‌ ప్రాంతాల్లో రోడ్ల పక్కన, డివైడర్ల సమీపంలో నివాసం ఉంటున్న ఆమెను వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి 2019లో ఖమ్మానికి చెందిన అన్నం ఫౌండేషన్‌ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ అన్నం శ్రీనివాసరావు ఖమ్మంలోని తమ ఆశ్రమానికి తరలించి ఆమెకు వసతి, భోజన సౌకర్యం కల్పించారు. ఆమె ఆరోగ్యం మెరుగైన తరువాత వివరాలు అడిగారు. తాను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బాంద్‌ జిల్లా అర్భయకు చెందిన మహిళనని తెలిపారు. దీంతో శ్రీని వాసరావు ఆమె ఆచూకీ, వివరాల గురించి అక్కడి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శాం తిదేవి కుటుంబ సభ్యుల గురించి విచారించగా 2013లో శాంతిదేవి తన భర్త భయ్యాపాల్‌ చనిపోయిన తరువాత ఆమె, తన ముగ్గురు కుమారులు, కుటుంబ సభ్యులు గ్రామం విడిచివెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 20 రోజుల అనంతరం ఆమె పెద్ద కుమారుడు దినేష్‌ అక్కడి పోలీసుల సహాయంతో వీడియోకాల్‌ అన్నం శ్రీనివాసరావు, శాంతిదేవితో మాట్లాడి ఆమెను తన అమ్మేనని గుర్తించాడు. దీంతో శుక్రవారం భద్రాచలం వచ్చిన దినేష్‌కు శాంతిదేవిని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ సమక్షంలో అప్పగించారు. ఈ సందర్భంగా అన్నం శ్రీనివాసరావు శాంతిదేవికి కొత్తజీవితాన్ని అందించేందుకు చేసిన కృషి కొనియాడారు. ఈసందర్భంగా అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ తా ము భద్రాచలం నుంచి ఈమెను తీసుకెళ్లే సమయంలో ఆరోగ్యం మెరుగైన తరువాత ఎలాగైనా ఆ మెన తన కు టుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ నేపఽథ్యంలో ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా ఆచూకీ కనుగొన్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్‌ సేవా సభ్యులు దేవిశ్రీ, పవన్‌, భద్రాచలానికి చెందిన శ్రీరంగం సంపత్‌, కడాలి నాగరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T05:00:46+05:30 IST