రైలు ఎక్కుతూ జారిపడిన తల్లీ కూతుళ్లు

ABN , First Publish Date - 2022-05-24T09:04:28+05:30 IST

చెవిటి, మూగ కుమార్తెతో ఆ తల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆ తల్లి.. రైలు ఎక్కే క్రమంలో జారిపడి ట్రైన్‌ కింద పడ్డారు.

రైలు ఎక్కుతూ జారిపడిన తల్లీ కూతుళ్లు

తీవ్ర గాయాలపాలై కుమార్తె మృతి.. ఏలూరులో విషాదం

ఏలూరు క్రైం, మే 23: చెవిటి, మూగ కుమార్తెతో ఆ తల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆ తల్లి.. రైలు ఎక్కే క్రమంలో జారిపడి ట్రైన్‌ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కుమార్తె మృతిచెందగా తల్లి ప్రాణాలతో బయటపడింది. ప్రత్యక్ష సాక్షులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు వంగాయిగూడెంకు ప్రాంతానికి చెందిన నువ్వుల లక్ష్మి (50) తన చెవిటి, మూగ కుమార్తె సాయిదుర్గ (25)ను తీసుకుని విశాఖపట్టణం వెళ్లేందుకు సోమవారం ఉదయం ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చి ఆగగా.. గార్డుకు ముందున్న జనరల్‌ బోగీలో ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రైలు కదలడంతో వారిద్దరూ రైలు బోగీ-ప్లాట్‌ ఫామ్‌ మధ్యలో చిక్కుబడి మెలితిరుగుతూ 20 మీటర్లుపైనే వెళ్ళిపోయారు. అంతలో ప్రయాణీకులు చైన్‌ లాగడంతో రైలు ఆగిపోయింది. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్‌ సీఐ బి.శంకరరావు, ఏఎ్‌సఐ రామారావు, సిబ్బంది కె.శ్రీనివాసరావు, సీహెచ్‌ ప్రసాద్‌ వెంటనే రంగంలోకి దిగారు. ఏఎ్‌సఐ, మరో కానిస్టేబుల్‌ రైలు కిందకు వెళ్ళి వారిని అతి కష్టం మీద తీసి లక్ష్మిని ఫ్లాట్‌ఫామ్‌ పైకి ఎక్కించారు. వారిని వెంటనే 108 అంబులెన్సులో ఎక్కించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా సాయిదుర్గ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై ఏలూరు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ సిహెచ్‌ విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-24T09:04:28+05:30 IST