వైద్యుడిపై తల్లీకొడుకుల దాడి

ABN , First Publish Date - 2020-07-07T08:00:23+05:30 IST

సోమాజిగూడలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టోఎంటరాలజీ ఆస్పత్రిలో ఓ వైద్యుడిపై ఓ మహిళతో పాటు ఆమె కొడుకు కలిసి దాడి చేశారు. టోలీచౌకి పారామౌంట్‌ కాలనీకి చెందిన షరీన్‌ఫాతిమా (54) అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం ఆమె కుమారుడు ఖాజా ఆఫాక్‌ అహ్మద్‌(23)తో కలిసి సోమాజిగూడలోని ఆస్పత్రికి వచ్చింది. అక్కడ విధులు

వైద్యుడిపై తల్లీకొడుకుల దాడి

పంజాగుట్ట, జూలై 6(ఆంధ్రజ్యోతి): సోమాజిగూడలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టోఎంటరాలజీ ఆస్పత్రిలో ఓ వైద్యుడిపై ఓ మహిళతో పాటు ఆమె కొడుకు కలిసి దాడి చేశారు.  టోలీచౌకి పారామౌంట్‌ కాలనీకి చెందిన షరీన్‌ఫాతిమా (54) అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం ఆమె కుమారుడు ఖాజా ఆఫాక్‌ అహ్మద్‌(23)తో కలిసి సోమాజిగూడలోని ఆస్పత్రికి వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ కె.పవన్‌కుమార్‌ ఆమెను పరీక్షస్తున్న సమయంలో ఆస్పత్రిలో మాస్కులు, శానిటైజర్లు లేవా అని అహ్మద్‌ వైద్యుడిని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. షరీన్‌ఫాతిమా ఆవేశం పట్టలేని స్థితిలో పవన్‌కుమార్‌ చెంపపై కొట్టింది. నిర్ఘాంతపోయిన వైద్యుడు వేరే ఆస్పత్రికి వెళ్లిపొమ్మంటూ సూచిస్తుండగా ఆమె మరోసారి దాడి చేయబోయింది. ఇంతలో అఫాక్‌ అహ్మద్‌ వైద్యుడి మెడను గట్టిగా పట్టుకుని దాడి చేశాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పవన్‌కుమార్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2020-07-07T08:00:23+05:30 IST