Kajol అలా.. Nysa ఇలా.. తల్లీకూతుర్లపై నెటిజన్ల సెటైర్లు

Published: Sun, 29 May 2022 13:44:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Kajol అలా.. Nysa ఇలా.. తల్లీకూతుర్లపై నెటిజన్ల సెటైర్లు

బాలీవుడ్‌ తార కాజోల్, ఆమె కూతురు నైసా దేవ్‌గణ్‌ని విపరీతంగా నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు ఇద్దరూ వేరు వేరుగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. అందులో తల్లీకూతుర్ల శరీరాల్లోని మార్పులను చూసి షాకైన నెటిజన్లు ట్రోలింగ్ ప్రారంభించారు. మొదట కాజోల్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో కాజోల్ కొంచెం లావుగా కనిపించింది. దీంతో పలువురు నెటజన్లు బాడీ షేమింగ్ (Body Shaming) చేస్తూ కామెంట్స్ చేశారు.


‘సినిమాలో ఎంతో అందంగా, సన్నగా కనిపించే ఈ సినీ జనాలు బయట ఇలా ఎందుకు ఉంటారు’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఏమైంది కాజోల్ ఎందుకు బరువు పెరిగిపోయింది’ అంటూ మరొకరు.. ఆంటీ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేశారు. కాగా.. మరోవైపు కాజోల్, అజయ్ దేవ్‌గణ్‌ కూతురు నైసాని చర్మం గురించి ట్రోలింగ్ చేశారు.


తాజాగా నైసా ఇంటి నుంచి బయటికి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో.. నైసా కొంచెం డల్‌గా కనిపించింది. దీంతో తనని స్కిన్ షేమింగ్ (Skin Shaming) చేయడం ప్రారంభించారు. ‘నైసా అంత అందంగా కనిపించడం లేదు. అయినప్పటికీ నెపోటిజం ఫిలింగ్‌తో కరణ్ జోహార్‌లాంటి వారు సినిమాలకి పరిచయం చేస్తారు’ అని ఒకరు.. ‘చర్మ సౌందర్యం కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంది. అందుకే నల్లగా ఉన్న ఆమె తెల్లగా అయ్యింది’ అంటూ మరొకరు.. అందంగా లేదు, తనకసలు ఏమైందంటూ ఇంకొందరు కామెంట్స్ చేశారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International