
బళ్లారి(కర్ణాటక): అనారోగ్యంతో మృతి చెందిన తల్లిని చూసి తట్టుకోలేక కుమారుడు మృత్యువాత పడ్డారు. బళ్లారి రూరల్ పరిధిలోని పరమదేవనహళ్లి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కురుబ పెద్దనాగప్ప భార్య నాగమ్మ (93) మృతి చెందడంతో ఆమె కుమారుడు కర్రెప్ప (56) రాత్రి ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలాపోయాడు. బంధువులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి