
ఆ చిన్నారి వయసు రెండేళ్లు.. గత నెల 15వ తేదీన ఆ చిన్నారి బస్టాండ్‌లో ఒంటరిగా ఉంది.. బక్క పలచగా పోషకాహారలోపంతో బాధపడుతున్న ఆ బాలికను తల్లి అక్కడ వదిలేసి వెళ్లిపోయింది.. దీంతో బస్టాండ్‌లో ఉన్న ఇతర ప్రయాణికులు ఆ బాలికను చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్‌కు పంపించారు.. పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆ బాలికను అధికారులు వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్వాలియర్‌కు సమీపంలోని శివపురి బస్టాండ్‌లో ప్రయాణికులు వేచి ఉండే గదిలో గత నెల 15న ఓ మహిళ తన రెండేళ్ల కూతురిని వదిలేసి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఉన్న ఇతర ప్రయాణికులు అందించిన సమాచారంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆ చిన్నారి బాధ్యతను తీసుకున్నారు. బాగా సన్నగా ఉన్న ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించి 17 రోజుల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ బాలిక కోలుకుంది. ఆ చిన్నారి తల్లి కోసం అధికారులు వెతుకుతున్నారు. రెండు, మూడు నెలల పాటు తల్లి గురించి చూసి, ఫలితం లేకపోతే, బాలికను ఎవరికైనా దత్తత
ఇస్తామని అధికారి తెలిపారు.