Bihar: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. గ్రామస్తులు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-07-27T01:31:36+05:30 IST

ఆ మహిళ వివాహిత (Married Woman).. ముగ్గురు పిల్లల తల్లి.. ఆమె భర్త దుబాయ్‌లో లేబర్‌గా పని చేస్తున్నాడు.

Bihar: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. గ్రామస్తులు ఏం చేశారంటే..

ఆ మహిళ వివాహిత (Married Woman).. ముగ్గురు పిల్లల తల్లి.. ఆమె భర్త దుబాయ్‌లో లేబర్‌గా పని చేస్తున్నాడు.. ఒంటరిగా ఉంటున్న ఆ మహిళ ఓ యువకుడితో ప్రేమలో పడింది.. తరచుగా అతడిని కలిసేది.. సోమవారం రాత్రి ఆమెను కలిసేందుకు యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు.. గ్రామస్తులు వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. ఇద్దరినీ ఓ స్తంభానికి కట్టేసి కొట్టారు.. పోలీసులు రంగ ప్రవేశం చేసి రాజీ కుదిర్చి ఇద్దరికీ పెళ్లి (Marriage) చేశారు.. అనంతరం ఆమె తన రెండో భర్తతో కలిసి వెళ్లిపోయింది.. బీహార్ (Bihar)లోని కరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Wife Missing: నా భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త ఫిర్యాదు.. జైపూర్ నుంచి తీసుకొచ్చిన పోలీసులు.. ఎందుకు వెళ్లావని అతడు నిలదీస్తే..


బత్సర్ గ్రామానికి చెందిన రుదల్ కుమార్ అనే యువకుడు కరారియా గ్రామానికి చెందిన ఓ వివాహితతో ప్రేమలో పడ్డాడు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమెను తరచుగా కలుసుకునేవాడు. సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగానే ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే గ్రామస్తులు ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ బయటకు తీసుకెళ్లి ఓ స్తంభానికి కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ విడిపించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరు కుటుంబాల వారిని పిలిచి మాట్లాడారు. 


ఇద్దరూ వివాహం చేసుకునేందుకు అంగీకరించారు. దీంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆలయంలో వీరి వివాహం జరిగింది. వివాహానంతరం ఆ మహిళ తన రెండో భర్త ఇంటికి వెళ్లింది. తన ముగ్గురు పిల్లలను అత్తగారి ఇంట్లోనే వదిలేసింది. దుబాయ్‌లో ఉన్న భర్తకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. 

Updated Date - 2022-07-27T01:31:36+05:30 IST