నలుగురు బిడ్డల తల్లి.. 15 ఏళ్ల బాలుడితో..

ABN , First Publish Date - 2022-07-28T09:22:09+05:30 IST

ఆమె నలుగురు బిడ్డల తల్లి.. వయస్సు 30 ఏళ్లు. ఇంటెదురుగా ఉన్న 15 ఏళ్ల బాలుడిపై కన్నేసింది.

నలుగురు బిడ్డల తల్లి.. 15 ఏళ్ల బాలుడితో..

  • నెల రోజులు గుట్టుగా సహజీవనం 
  • గుడివాడ నుంచి హైదరాబాద్‌కు మకాం
  • ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు చూపించి వల
  • పోలీసుల అదుపులో నిందితురాలు


గుడివాడ, జులై 27: ఆమె నలుగురు బిడ్డల తల్లి.. వయస్సు 30 ఏళ్లు. ఇంటెదురుగా ఉన్న 15 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. మాయమాటలు చెప్పి పోర్న్‌ వీడియోలు చూపించింది. అతన్ని శారీరకంగా లొంగదీసుకుంది. విషయం బయటకు పొక్కితే తమ సంబంధానికి ఇబ్బంది అని గుర్తించి ఆ బాలుడిని తీసుకుని హైదరాబాద్‌ వచ్చి, ఇక్కడ ఆ బాలుడితో సహజీవనం మొదలుపెట్టింది. బాలుడి కు టుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన గుడివాడ టూటౌన్‌ పోలీసులు.. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఈ కేసును ఛేదించారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్నట్టు గుర్తించి వా రిద్దరినీ  గుడివాడ తీసుకెళ్లారు. కేసు వివరాలను టూటౌన్‌ సీఐ వి.దుర్గారావు బుధవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్‌మన్‌పేటకు చెందిన వివాహిత స్వప్న (30)కు నలుగురు పిల్లలు ఉన్నారు. భర్తకు అనారోగ్య సమస్యలు ఉం డటంతో వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎదురిం ట్లో ఉండే 15 ఏళ్ల బాలుడితో స్వప్న చనువుగా ఉండేది.


ఫోన్‌లో నీలిచిత్రాలు చూపించి అతనితో శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ వ్యవహారం గుట్టుగా నెల రోజు లు సాగింది. అయితే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాలుడు తనకు దూరమవుతాడని భావించిన స్వప్న.. పిల్లలు, భర్తను వదిలేసి ఈనెల 19న అతన్ని తీసుకుని హైదరాబాద్‌ వచ్చి, బాలానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  సీఐ వి దుర్గారావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి.. ఎదురింట్లో ఉండే స్వప్నే బాలుడిని కిడ్నాప్‌ చేసినట్టు నిర్ధారించుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నారని గుర్తించి  ఇక్కడకు వచ్చి వా రిని తీసుకెళ్లారు. బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వప్నపై పోక్సో చట్టంతోపాటు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.


సమాచారం లేదు: బాలానగర్‌ సీఐ

బాలానగర్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ మిస్సింగ్‌ కేసును గుడివాడ టూటౌన్‌ పోలీసులు ఛేదించిన విషయం బాలానగర్‌లో చర్చనీయాంశమైంది. వారిద్దరినీ గుడివాడ పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని  సీఐ భాస్కర్‌ తెలిపారు.

Updated Date - 2022-07-28T09:22:09+05:30 IST