పసిపాపను ఆస్పత్రి కిటికీలోంచి విసిరేసిన తల్లి.. 12 ఏళ్ల క్రితం నాటి కేసులో కోర్టు తుది తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-21T23:46:32+05:30 IST

నవమాసాలు మోసి, పురిటినొప్పులను కూడా భరించి ఓ ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. అయితే కుటుంబ కారణాలో లేక మరే ఇతర కారణాలు ప్రేరేపించాయో కానీ ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కన్నబిడ్డ

పసిపాపను ఆస్పత్రి కిటికీలోంచి విసిరేసిన తల్లి.. 12 ఏళ్ల క్రితం నాటి కేసులో కోర్టు తుది తీర్పు ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: నవమాసాలు మోసి, పురిటినొప్పులను కూడా భరించి ఓ ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. అయితే కుటుంబ కారణాలో లేక మరే ఇతర కారణాలు ప్రేరేపించాయో కానీ ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కన్నబిడ్డను తన చేతులతోనే ఆస్పత్రి కిటికీలోంచి బయటకు విసిరేసింది. దాదాపు 12ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై కోర్టు తాజాగా తుది తీర్పు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మహరాష్ట్రకు చెందిన దీపిక పార్మర్ అనే మహిళకు కొన్నళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలోనే గర్భందాల్చి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటో తెలియదు కానీ.. 2010 అక్టోబర్ 26న ఉదయం 5 గంటలకు ముంబైలోని కేఈఎమ్ ఆసుపత్రి కిటికీల నుంచి కన్నబిడ్డను తన చేతులతోనే బయటకు విసిరేసింది. ఆ తర్వాత బిడ్డ కనబడటం లేదంటూ నాటకాలాడింది. ఆసుపత్రి ప్రాంగణంలోని బాత్రూమ్‌ల వద్ద వైద్య సిబ్బంది పాపను గుర్తించినప్పటికీ ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించడం వల్ల మరణించింది. ఈ క్రమంలో అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ పసిపాప మరణానికి తల్లి దీపిక పార్మరే కారణం అని గుర్తించారు. అందుకు అవసరమైన సాక్ష్యాలను కూడా సంపాదించారు. కాగా.. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన సెషన్స్ కోర్టు తాజాగా తుది తీర్పు వెల్లడించింది. దీపిక పార్మర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై స్పందించిన దీపిక పార్మర్ భర్త.. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేయనున్నట్టు వెల్లడించాడు. 




Updated Date - 2022-04-21T23:46:32+05:30 IST