డాబా పైనుంచి చెత్తకుప్పలోకి శిశువును విసిరేసింది నువ్వే కదా.. నిజం చెప్పు అని నిలదీస్తే ఆ యువతి చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-01-22T23:52:43+05:30 IST

చెత్తకుప్ప వద్ద నుంచి శిశువు ఏడుపు శబ్దం రావడంతో స్థానికులు కంగారుపడ్డారు. అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో రక్తస్రావం‌తో కనిపించిన శిశువును చూసి షాకయ్యారు. వెంటనే ఆ శిశువును ఆసుపత్రిలో చేర్పించారు

డాబా పైనుంచి చెత్తకుప్పలోకి శిశువును విసిరేసింది నువ్వే కదా.. నిజం చెప్పు అని నిలదీస్తే ఆ యువతి చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: చెత్తకుప్ప వద్ద నుంచి శిశువు ఏడుపు శబ్దం రావడంతో స్థానికులు కంగారుపడ్డారు. అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో రక్తస్రావం‌తో కనిపించిన శిశువును చూసి షాకయ్యారు. వెంటనే ఆ శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత ఎట్టకేలకు ఆ పసిపాపకు జన్మనిచ్చిన మహిళను వెతికి పట్టుకున్నారు. అయితే.. తొలుత తాను ఎవరికీ జన్మనివ్వలేదని బుకాయించిన ఆమె.. చివరికి నిజం ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆమె చెప్పింది విని అంతా విస్తుపోయారు. 


హర్యానాలోని పానిపట్‌‌లో‌ ఉన్న శివ‌నగర్‌లో ఒక చెత్తకుప్ప వద్ద బుధవారం రోజు ప్లాస్టిక్ కవర్లో అప్పడే పుట్టిన ఆడ శిశువు దొరకడం స్థానికంగా కలకలం రేపింది. రక్తస్రావంతో కనిపించిన శిశువును అక్కడి ప్రజలు ఆసుపత్రిలో చేర్పించగా.. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ నేత సవితా ఆర్యా... ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆ శిశువుకు జన్మనిచ్చిన మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు మూడు రోజులపాటు తీవ్రంగా శ్రమించారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. ఎట్టకేలకు ఆ చెత్తకుప్ప దగ్గర్లోని ఇంట్లో.. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న 21ఏళ్ల యువతి శిశువుకు జన్మనిచ్చినట్టు సవితా ఆర్యా గుర్తించారు. అనంతరం నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అయితే తొలుత తాను ఎవరికీ జన్మనివ్వలేదని ఆ యవతి బుకాయించింది. దాబా పైనుంచి చెత్తకుప్పలోకి శిశువును విసిరేసింది నువ్వే అని గట్టిగా నిలదీయటంతో నిజం ఒప్పుకుంది. జరిగిన విషయాన్ని తెలిపింది. 



మీరట్‌లో స్థానికంగా ఉన్న కంపెనీలో పని చేస్తున్న సమయంలో 22ఏళ్ల యువకుడితో పరిచయమేర్పడినట్టు తెలిపింది. అదికాస్త శారీరిక సంబంధానికి దారి తీయటంతో.. పలుమార్లు అతడి రూమ్‌లో శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పింది. ఆ తర్వాత అతడు తనను వదిలేసినట్టు వెల్లడించింది. అయితే అప్పటికే తాను గర్భం దాల్చినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి శిశువుకు జన్మనిచ్చినట్టు చెప్పింది. అనంతరం శిశువును ప్లాస్టిక్ కవర్లో పెట్టి.. దాబా పైనుంచి చెత్తకుప్పలోకి విసిరేశానని వెల్లడించింది.




Updated Date - 2022-01-22T23:52:43+05:30 IST