స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడో కొడుకు.. ఆనందంతో తన ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టిందా తల్లి.. 24 గంటల్లో షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-06-03T01:14:58+05:30 IST

‘అమ్మా నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చా’ అని కొడుకు చెప్పగానే ఆ తల్లి సంబర పడిపోయింది. ‘ఏంటా గిఫ్ట్’ అని ఎంతో ఆనందంతో ప్రశ్నించింది. ఈ క్రమంలో కొడుకు ఆమె చేతిలో స్మార్ట్‌ఫోన్ పెట్టడంతో మురిసిపోయింది. వెం

స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడో కొడుకు.. ఆనందంతో తన ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టిందా తల్లి.. 24 గంటల్లో షాకింగ్ ట్విస్ట్..!

ఇంటర్నెట్ డెస్క్: ‘అమ్మా నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చా’ అని కొడుకు చెప్పగానే ఆ తల్లి సంబర పడిపోయింది. ‘ఏంటా గిఫ్ట్’ అని ఎంతో ఆనందంతో ప్రశ్నించింది. ఈ క్రమంలో కొడుకు ఆమె చేతిలో స్మార్ట్‌ఫోన్ పెట్టడంతో మురిసిపోయింది. వెంటనే ఫేస్‌బుక్ ఓపెన్ చేసి, తన ఫొటోను అప్లోడ్ చేసింది. అయితే 24 గంటలు తిరక్కుండానే ఆమె కంగుతింది. ఇంటికి పోలీసులు రావడంతో షాకైంది. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌కు చెందిన జాఫర్ అలియాస్ షాదాబ్ అనే యువకుడు తాజాగా తన తల్లికి ఓ స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆమె తెగ సంబరపడిపోయింది. వెంటనే ఫొన్‌లో సెల్ఫీ దిగి.. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. 24 గంటలు గడవకముందే ఆమె ముందు పోలీసులు ప్రత్యక్షం అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆమె షాకైంది. జాఫర్ ఓ యువకుడి ఫోన్‌ను దొంగిలించి.. దాన్నే తనకు గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుసుకుని విస్తుపోయింది. ఈ నేపథ్యంలోనే అధికారులు జాఫర్ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఫోన్‌ను జాఫర్‌ దొంగిలించినా.. అందులోని డేటాను మాత్రం డిలీట్ చేయలేదని చెప్పారు. అది తెలియకుండా.. జాఫర్ తల్లి తన ఫొటోను ఫోన్ యజమాని ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేసిందని పేర్కొన్నారు. అది గమనించి.. అతడు తమకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జాఫర్ ఇంటి అడ్రస్‌ను ట్రేస్ చేసి అతడిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. 


Updated Date - 2022-06-03T01:14:58+05:30 IST