పండు వయసులో పడరాని పాట్లు పడుతున్న తల్లి

ABN , First Publish Date - 2020-09-13T04:09:12+05:30 IST

ఇద్దరు పిల్లలను కన్న ఆ తల్లి పండు వయసులో పడరాని పాట్లు పడుతోంది. పిల్లలను పెంచి ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్లు చేసింది. అమ్మాయికి..

పండు వయసులో పడరాని పాట్లు పడుతున్న తల్లి

ఇద్దరు పిల్లలను కన్న ఆ తల్లి పండు వయసులో పడరాని పాట్లు పడుతోంది. పిల్లలను పెంచి ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్లు చేసింది. అమ్మాయికి, అబ్బాయికి మంచి జీవితాన్నిచ్చేందుకు తన జీవితాన్ని దారపోసింది. తీరా ఇప్పుడు తనకే జీవనాధారం లేక బస్టాప్‌లో ఉంటూ బిచ్చమెత్తుకుంటోంది. అదేమంటే కొడుకు, కూతురు గెంటేశారని ఆవేదన వ్యక్తం చెందుతోంది. కనీసం తనకు పెన్షన్ ఇస్తే తన బతుకు తాను బతుకుతానంటూ అధికారుల దయ కోసం ఎదురుచూస్తోంది. అమ్మా అనగానే ఎవరైనా కరిగిపోవాల్సిందే. అలాంటిది అమ్మకు ఎన్నో కష్టాలు. ఎన్నో బాధలు. ప్రశాంతంగా సేదతీరి ఇంటిపట్టున ఉండాల్సిన ఆ అమ్మను ఆదరించేవారు లేక  అనేక అవస్థలు పడుతోంది.


విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద బస్టాపును ఆవాసంగా చేసుకుని అడుక్కుంటూ పొట్ట నింపుకుంటోంది. ఆమె దీన స్థితిని చూసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఆమెను పలకరించారు. ‘ఏంటమ్మా నీ కష్టమంటే’.. ఆమె కన్నీటి పర్యంతమైంది. తనకు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిని పెంచి ప్రయోజకుల్ని చేసినా తనను పట్టించుకోవడంలేదని చెప్పింది. కోడలు తనపై చేయి చేసుకున్నా కొడుకు కనీసం అడ్డుకూడా చెప్పకపోవడం తనను బాధించిందని ఆమె చెప్పింది. 

Updated Date - 2020-09-13T04:09:12+05:30 IST