Mothers day రాజ్ భవన్ లో మదర్స్ డే ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-08T21:42:20+05:30 IST

అంతర్జాతీయ మాతృదినోత్సవ (mothers day) ఉత్సవాలు ఆదివారం రాజ్ భవన్ లో ఘనంగా జరిగాయి.

Mothers day రాజ్ భవన్ లో మదర్స్ డే ఉత్సవాలు

హైదరాబాద్: అంతర్జాతీయ మాతృదినోత్సవ (mothers day) ఉత్సవాలు ఆదివారం రాజ్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ  సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై (tamilisy soundara rajan) సౌందరరాజన్ పాల్గొన్నారు. రాజ్ భవన్ పరివార్, వారి కుటుంబ సభ్యుల మాతృమూర్తులతో కలసి మాతృదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారిని గవర్నర్ తమిళిసై సత్కరించి, శుబాకాంక్షలు తెలిపారు.మాతృదినోత్సవం అంటేనే అమ్మలను సత్కరించుకోవడం అని, బిడ్డల కోసం వారు చేసే త్యాగాలను స్మరించుకోవడమని అన్నారు. ప్రతి బిడ్డా తల్లని గౌరవించాలని అన్నారు. 


Read more