ప్రజలను చైతన్యపరచండి

ABN , First Publish Date - 2021-04-23T05:03:55+05:30 IST

కరోనాపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సర్పం చ, వార్డు మెంబర్లు, వలంటీర్లు, సచివా లయ సిబ్బందికి వైరస్‌ వ్యాప్తి నిర్మూల నపై ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు.

ప్రజలను చైతన్యపరచండి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గోపవరం మండల సర ్పంచులు, సచివాలయ సిబ్బంది

కరోనాపై ఒక్క రోజు శిక్షణలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సూచనలు

బద్వేలు/గోపవరం/పోరుమామిళ్ల/చాపాడు/బి.కోడూరు/చక్రాయపేట/పులివెందుల, రూరల్‌,/బి.మఠం ఏప్రిల్‌ 22: కరోనాపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సర్పం చ, వార్డు మెంబర్లు, వలంటీర్లు, సచివా లయ సిబ్బందికి వైరస్‌ వ్యాప్తి నిర్మూల నపై ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఆఫ్‌ ఇండియన ఇనస్టిట్యూట్‌ ద్వారా డాక్టర్‌ రాజన శుక్ల, డాక్టర్‌ శ్రీనాథ్‌, డాక్టర్‌ శైలిమ, డాక్టర్‌ మూర్తి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

జూమ్‌ యాప్‌ ద్వారా ప్రత్యేకం గా నిర్వ హించిన శిక్షణలో రాష్ట్ర వ్యాప్తం గా సర్పంచ, వార్డు మెంబర్లు, వలంటీ ర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బద్వేలు పరిధిలో ఎనజీఓ హోం, బాలు ర ఉన్నత పాఠశాల, గోపవరం మండల పరిధిలో రాచపూడి నాగభూషణం కాలే జీ,  పోరుమామిళ్లలో స్ర్తీశక్తి భవనం, చాపాడులోని వెలుగు కార్యాలయం, చక్రాయపేట మండల ఎమ్మార్సీ కార్యా లయంలో శిక్షణ నిర్వహించారు.]

రాచపూ డి నాగభూషణం కాలేజీలో నిర్వహించి న శిక్షణలో గోపవరం ఇనఛార్జ్‌ ఎంపీడీ ఓ భానుప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా నివారణ పట్ల ప్రజలను చైత న్యపరచాలన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడ కం, భౌతిక దూరం పాటించ డం లాంటి విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించా లన్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన చేయించుకునేలా చూడాలని ఆయన సూచించారు.

సెకండ్‌ వేవ్‌ పల్లెలపై ప్రభావం చూపు తోందని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, సచి వాలయ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. ఎంఈఓ చిన్నయ్య పాల్గొన్నారు. బద్వేలు మండలంలోని  పంచాయతీల సర్పంచులు, వార్డు మెం బర్లు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు ఎనజీఓ హోం, బాలుర ఉన్నత పాఠశాల లో శిక్షణ నిర్వహించినట్లు ఎంపీడీఓ రామకృష్ణయ్య తెలిపారు. మండల విద్యాశాఖాధికారి కె.రామచంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌బాబు, వే మయ్య పాల్గొన్నారు.

పోరుమా మిళ్ల మండల వ్యవసాయ సహా య సంచాలకులు వెంకటసుబ్బా రావు, ఎంపీడీఓ నూర్జహాన, ఏఓ వరహరికుమార్‌, పంచాయతీ కార్యదర్శి రాజీవ్‌రెడ్డి రంగసము ద్రం 1, 3 రైతు భరోసా కేంద్రా ల్లో  సర్పంచులు, వార్డుమెంబర్లు, వలంటీర్లు, సిబ్బంది, రంగసము ద్రం సర్పంచ చిత్తా రవిప్రకాశ రెడ్డి, మండల సర్పంచులు పాల్గొ న్నారు.

చాపాడు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు టీకా వేయించుకోవాలని ఎంపీడీఓ శ్రీధర్‌నా యుడు సూచించారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు, మహిళా పోలీ సులు పాల్గొన్నారు. బి.కోడూరు మండ లంలో సర్పంచులు, వార్డుసభ్యులు, పంచాయతీ సెక్రటరీలకు  మండల విద్యాశాఖాధికారి మురళీదేవి ఆధ్వర్యం లో శిక్షణ నిర్వహించారు.

చక్రాయపేట ఎంఈఓ రవీంద్రనాయక్‌ కొవిడ్‌ తీవ్రత మార్గదర్శకాలపై సర్పంచులు, కార్యద ర్శులు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఏఎనఎంలకు  శిక్షణ ఇచ్చారు. కార్యక్ర మంలో సురభి, నెర్సుపల్లె, చిలేకాంపల్లె, గడ్డంవారిపల్లె సర్పంచులు పాల్గొన్నారు. పులివెందుల ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో ఈఓపీఆర్డీ మల్లికార్జున రెడ్డి, ఎంపీడీఓ రెడ్డయ్యనాయుడు ఆధ్వ ర్యంలో శిక్షణ ఇచ్చారు. సర్పంచులు, వార్డుమెంబర్లు,  వలంటీర్లు, సచివాల యాల సిబ్బంది హాజరయ్యారు.

బ్రహ్మం గారిమఠం మండల వెలుగు కార్యాల యంలో ఎంపీడీఓ వెంగమునిరెడ్డి ఆధ్వ ర్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణపై అవగా హన చేపట్టారు. ఎంపీడీఓ మాట్లాడు తూ వ్యాక్సినపై ఎటువంటి సందేహాలు పడవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ  నిబంధనలను పాటించాలని సూచించా రు. కార్యక్రమంలో మండల విద్యాశాఖా ధికారి పుల్లయ్య, ఇనఛార్జి ఈఓపీఆర్‌డీ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T05:03:55+05:30 IST