ఇంకుతో తడిసిముద్దయిన ఆ ప్రముఖ రచయిత పెదాలు.. కారణం అడిగిన యువకునికి దిమ్మతిరిగే సమాధానం!

ABN , First Publish Date - 2021-12-25T13:57:05+05:30 IST

ప్రముఖ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్‌కు..

ఇంకుతో తడిసిముద్దయిన ఆ ప్రముఖ రచయిత పెదాలు.. కారణం అడిగిన యువకునికి దిమ్మతిరిగే సమాధానం!

ప్రముఖ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్‌కు సంబంధించిన ఆసక్తికర ఉదంతం ఇది. మున్షీ పెదవులపై ఎప్పుడూ సిరా రంగు కనిపించేది. దీనిని అతని చుట్టుపక్కలవారు గమనించేవారు. అయితే దీనిగురించి అడగడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఒక కార్యక్రమంలో ఒక యువకుడు మున్షీజీని.. 'మీరు రచనలు సాగించేందుకు ఎలాంటి కాగితాన్ని.. పెన్నును ఎన్నుకుంటారు?' అని అడిగాడు. ఈ ప్రశ్నకు మున్షీ నవ్వుతూ, 'నేను ఎలాంటి కాగితంపై రచనలు సాగిస్తానంటే.. అప్పటి వరకూ దానిపై ఏమీ రాసివుండని.. అంటే ఖాళీ కాగితాన్ని, పాళీ విరిగిపోని పెన్నును వినియోగిస్తానన్నారు.


చాలా మంది రచయితలు మూడ్ క్రియేట్ చేసుకుని రాయడానికి ఇష్టపడతారు. అలాగే పేపర్ ఇలా ఉండాలి.. కలం ఇలా ఉండాలి అని కోరుకుంటారు. ఈ ప్రశ్నకు ప్రేమ్ చంద్ ఎలా సమాధానమిస్తారోననే ఆసక్తితోనే ఆ యువకుడు మున్షీని ఈ ప్రశ్న అడిగాడు. కొద్దిసేపటి తరువాత మున్షీ మాట్లాడుతూ.. 'మేం కలం పనివాళ్లం. అలా అని పెన్నుతో అడ్డదిడ్డంగా ఆటలాడుకోము’ అని అన్నారు. ఆ రోజుల్లో పెన్నుకు ఉన్న పాళీని సిరాలో ముంచి కాగితంపై రాస్తుండేవారు. ఒక్కోసారి మున్షీ తన కలానికి ఉన్న పాళీని నోటితో కొరుకుతూ ఉండేవాడు. ఫలితంగా అతని పెదవులపై సిరా మరకలు ఏర్పడేవి. మున్షీ సమాధానం విన్న తరువాత ఆ యువకునికి మున్షీ రచనలు ఎందుకు భిన్నంగా ఉంటాయో అర్థమయ్యింది. క్రియేటివ్ వర్క్ చేయాలనుకునే వారికి ఏకాగ్రతే ముఖ్యమని, నిబంధనలతో ఏదో చేద్దామనుకోవడం సరైనది కాదని ప్రేమ్‌చంద్ ఈ ఉదంతం ద్వారా తెలియజేశారు.

Updated Date - 2021-12-25T13:57:05+05:30 IST