Moto G32: అతి తక్కువ ధర.. అత్యద్భుతమైన ఫీచర్లు: భారత్‌లో విడుదలైన ‘మోటో జి32’

ABN , First Publish Date - 2022-08-09T23:09:37+05:30 IST

స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మోటరోలా(Motorola) తాజాగా ‘జి’ సిరీస్‌లో మరో అద్భుతమైన

Moto G32: అతి తక్కువ ధర.. అత్యద్భుతమైన ఫీచర్లు: భారత్‌లో విడుదలైన ‘మోటో జి32’

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మోటరోలా(Motorola) తాజాగా ‘జి’ సిరీస్‌లో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘మోటో జి32’ పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను అందరికీ అనువైన రీతిలో తీర్చిదిద్దింది.  6.5 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ, 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. థింక్‌షీల్డ్ సెక్యూరిటీ సొల్యూషన్‌తో వస్తున్న ఇది డస్ట్, వాటర్ ప్రూఫ్‌ కావడం మరో విశేషం.

  

 మోటో జి32 ధర వివరాలు

 మోటో జి32 4జీబీ+64జీబీ సింగిల్ వేరియంట్‌లో వస్తోంది. ధర రూ. 12,999 మాత్రమే. మినరల్ గ్రే, శాటిన్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఆగస్టు 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ప్రముఖ ఆఫ్‌లైన్ అవుట్‌లెట్ల నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. అంటే రూ. 11,749కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. జియో ఖాతాదారులు రీచార్జ్‌లపై రూ. 2 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే, రూ. 2,549 జీ5 వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై రూ. 549 డిస్కౌంట్ లభిస్తుంది. 


 మోటో జి32 స్పెసిఫికేషన్లు

డ్యూయల్ సిమ్ (నానో), 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ స్క్రీన్, 680 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమరీ, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ 12, 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ షూటర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డ్యూయల్ మైక్రోఫోన్స్, ఫేస్ అన్‌లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, థింక్‌‌షీల్డ్ మొబైల్ సెక్యూరిటీ, డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఉన్నాయి.  

Updated Date - 2022-08-09T23:09:37+05:30 IST