Moto G62: ఇండియాలో లాంచ్ అయిన బడ్జెట్ 5జీ ఫోన్.. ధర ఎంతంటే?

ABN , First Publish Date - 2022-08-13T02:54:16+05:30 IST

భారత 5జీ మార్కెట్లో సంచలనాలు సృష్టించేందుకు మోటరోలా సిద్ధమైంది. తాజాగా 5జీ బడ్జెట్ స్మార్ట్‌‌ఫోన్ ‘మోటో జి62’ను

Moto G62: ఇండియాలో లాంచ్ అయిన బడ్జెట్ 5జీ ఫోన్.. ధర ఎంతంటే?

న్యూఢిల్లీ: భారత 5జీ మార్కెట్లో సంచలనాలు సృష్టించేందుకు మోటరోలా సిద్ధమైంది. తాజాగా 5జీ బడ్జెట్ స్మార్ట్‌‌ఫోన్ ‘మోటో జి62’ను మార్కెట్లోకి విడుదల చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అయిన Moto G62లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.


ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట‌తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. Moto G62లో రెండు ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. 6జీబీ+128 జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ 5జీ ఫోన్ల ధర వరుసగా రూ. 17,999, రూ 19,999. మిడ్‌నైట్ గ్రే, ఫ్రోస్టెడ్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్స్‌, ఈఎంఐ లావాదేవీల ద్వారా రూ.1750 తగ్గింపు పొందవచ్చు. ఫలితంగా మొదటి వేరియంట్‌ ధర రూ. 16,249లకు, రెండో వేరియంట్‌ని రూ.18,249లకు పొందవచ్చు. 


Moto G62 స్పెసిఫికేషన్లు:  6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, అండర్ ది హుడ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 6 జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్లు, 128జీబీ అంతర్గత మెమరీ,  50 మెగాపిక్సల్‌ ప్రైమరీ క్వాడ్ ఫంక్షన్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20W ఫాస్ట్ చార్జింగ్, 5జీ, 4జీ ఎల్‌టీఈ.  వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి.

Updated Date - 2022-08-13T02:54:16+05:30 IST