Moto G72: ఇండియాలో ‘మోటో జీ72’ ఫోన్ విడుదల.. బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ రేటు ఎంతో తెలుసా...

ABN , First Publish Date - 2022-10-03T23:54:40+05:30 IST

మోటరోలా (Motorola) నుంచి మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మోటో జీ72 ( Moto G72) పేరిట ఈ ఫోన్‌ని విడుదల చేసింది.

Moto G72: ఇండియాలో ‘మోటో జీ72’ ఫోన్ విడుదల.. బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ రేటు ఎంతో తెలుసా...

మోటరోలా (Motorola) నుంచి మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. మోటో జీ72 ( Moto G72) పేరిట ఈ ఫోన్‌ని ఆవిష్కరించింది. బడ్జెట్ పరిధిలో ప్రీమియం ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనుకునేవారికి ఈ ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. pOLED 120Hz HDR10+ డిస్‌ప్లే, 108 - మెగాపిక్సెల్ ట్రిపుల్ రీర్ కెమెరా(బ్యాక్) సెటప్, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్‌ కెపాసిటీ ఛార్జర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్‌మోస్ట్‌తో డ్యుయెల్ స్టీరియో స్పీకర్స్‌, ఇతర ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ 4జీ చిప్‌సెట్‌తో రానుంది. అంటే 5జీ నెట్‌వర్క్‌కి ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.18,999గా ఉంది. 


ఫీచర్లు ఇవే..

స్లిమ్ ప్రొఫైల్, లైట్‌వెయిట్ డిజైన్, రియర్ ప్యానెల్ ఉన్నాయి. మీడియా టెక్ హెలియో జీ99 ఎస్‌వోసీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. మెటియోరైట్ గ్రే, పొలార్ బ్లూ ఈ రెండు రంగుల్లో ఫోన్ లభించనుంది. డాల్బీ అట్మోస్‌తో డ్యుయెల్ స్టీరియో స్పీకర్స్‌ లభించనున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఫోన్‌కి 3 బ్యాక్ కెమెరాలు ఉంటాయి. ఇందులో ఒక 108-మెగాపిక్సెల్ సామ్‌సంగ్ హెచ్ఎం6 కెమెరా, ఒక 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఒక 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫ్రంట్ 16- మెగాపిక్సెల్ కెమెరాను అందించింది.

Updated Date - 2022-10-03T23:54:40+05:30 IST