మౌంట్‌ రైలుకు ‘బ్రేక్స్‌ ఉమెన్‌’ నియామకం

ABN , First Publish Date - 2022-06-18T15:40:02+05:30 IST

నీలగిరి కొండ రైలులో తొలిసారిగా ‘బ్రేక్స్‌ ఉమెన్‌’ను నియమించారు. నీలగిరి జిల్లా ఊటీ, కున్నూరు, మేట్టుపాళయం మధ్య పళ్ల చక్రాల సహాయంతో

మౌంట్‌ రైలుకు ‘బ్రేక్స్‌ ఉమెన్‌’ నియామకం

                        - మహిళను నియమించడం ఇదే తొలిసారి


ఐసిఎఫ్‌(చెన్నై), జూన్‌ 17: నీలగిరి కొండ రైలులో తొలిసారిగా ‘బ్రేక్స్‌ ఉమెన్‌’ను నియమించారు. నీలగిరి జిల్లా ఊటీ, కున్నూరు, మేట్టుపాళయం మధ్య పళ్ల చక్రాల సహాయంతో కొండ మార్గంలో రైళ్లు నడుపుతున్నారు. రైలుపెట్టెలు దెబ్బతినకుండా ఉండేలా బ్రేక్‌ను పట్టుకొని ఈ రైలు నడుపుతున్నారు. దీని కోసం రైలులో ఒక్కో పెట్టెకు ఒక్కో బ్రేక్స్‌ మెన్‌ ఉంటారు. ఇప్పటివరకు పురుషులు మాత్రమే ఈ పనులు చేపడుతుండగా తొలిసారిగా కున్నూర్‌కు చెందిన శివజ్యోతి (45) అనే మహిళ ‘బ్రేక్స్‌ ఉమెన్‌’ పోస్టులో నియమితులయ్యారు. కున్నూర్‌ యార్డ్‌లో ఎనిమిదేళ్లుగా గ్యారేజ్‌ విభాగం విధులు నిర్వహించిన ఆమెను ఇటీవల దక్షిణ రైల్వే ఈ పోస్టులో నియమించి మేట్టుపాళయం, ఈరోడ్‌ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం ఊటీ-కున్నూర్‌-మేట్టుపాళయం మధ్య నడిచే కొండ రైలులో బ్రేక్స్‌ ఉమెన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-06-18T15:40:02+05:30 IST