నోటి పుండ్లు ఎందుకు వస్తాయి?

ABN , First Publish Date - 2022-03-01T17:23:55+05:30 IST

పెదవుల లోపల, నాలుక మీద తలెత్తే నోటి పుండ్లతో చెప్పలేనంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇవి తరచుగా వేధిస్తున్నాయంటే పరిస్థితిని తీవ్రంగానే పరిగణించి, మూల కారణాలను సరిదిద్దుకోవాలి.

నోటి పుండ్లు ఎందుకు వస్తాయి?

ఆంధ్రజ్యోతి(01-03-2022)

పెదవుల లోపల, నాలుక మీద తలెత్తే నోటి పుండ్లతో చెప్పలేనంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇవి తరచుగా వేధిస్తున్నాయంటే పరిస్థితిని తీవ్రంగానే పరిగణించి, మూల కారణాలను సరిదిద్దుకోవాలి. 

నోటి పుండ్లకు ప్రధాన కారణం నోటి శుభ్రత పాటించకపోవడమే! అలాగే మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. కాబట్టి నోరు శుభ్రంగా ఉంచుకోవటంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. విటమిన్ల లోపం తలెత్తకుండా సమతులాహారం తీసుకోవాలి. మాంసకృత్తులు, పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి. తాజా పళ్లతో అవసరమైన విటమిన్లు అందుతాయి. నోటి పుండ్లు తగ్గేవరకూ మల్టీ విటమిన్‌ మాత్రలు వాడటం మేలు. 

Updated Date - 2022-03-01T17:23:55+05:30 IST