విజయగర్జన సభకు తరలాలి

ABN , First Publish Date - 2021-10-25T05:18:17+05:30 IST

విజయగర్జన సభకు తరలాలి

విజయగర్జన సభకు తరలాలి
కడ్తాల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ మండల అధ్యక్షుడు కంబాల పరమేశ్‌

కొందుర్గు/షాద్‌నగర్‌ అర్బన్‌/ఆమనగల్లు/కడ్తాల్‌/మాడ్గుల/తలకొండపల్లి: వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నవంబర్‌ 15న నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ కోరారు. ఆదివారం కొందుర్గులో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలన్నారు. వైస్‌ఎంపీపీ రాజేష్‌పటేల్‌, నర్సింహారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, సయ్యద్‌సాదిక్‌, రమే్‌షరెడ్డి, రెడ్డి నర్సింలు, మానయ్య, సుందర్‌, శ్రీకాంత్‌గౌడ్‌, నర్సింలు, సునిత, బాల్‌రాజ్‌, సచిన్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్‌ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల సమావేశం జరిగింది. ప్రతీ గ్రామం నుంచి విజయగర్జన సభకు తరలిరావాలని కోరారు. ఎంపీపీ ఇద్రీ్‌షఅహ్మద్‌, విండో చైర్మన్‌ బక్కన్నయాదవ్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు ఎంఎస్‌ నటరాజ్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, యువ నాయకుడు వై.మురళీయాదవ్‌, మాజీ చైర్మన్‌ అగ్గనూరి విశ్వం, కౌన్సిలర్లు సర్వర్‌పాష, ఈగ వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు. విజయగర్జన సభ విజయవంతానికి కార్యకర్తలంతా తరలాలని టీఆర్‌ఎస్‌ ఆమనగల్లు మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు, మున్సిపల్‌ కన్వీనర్‌ పత్యనాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు సత్యం పిలుపునిచ్చారు. ఆమనగల్లు మండల, మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో అధ్యక్షులు పి. అర్జున్‌రావు, పత్యనాయక్‌ మాట్లాడుతూ వరంగల్‌లో నిర్వహించే సభకు వెల్లువలా పోటెత్తాలన్నారు. 20ఏళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని సాధించి మరెన్నో విజయాలు సాధించి ప్రజల హృదయాల్లో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా అనంతరం నూతన అధ్యక్షులను నాయకులు సన్మానించారు. ఎంపీటీసీ దోనాదుల కుమార్‌, విండో వైస్‌చైర్మన్‌ సత్యం, సర్పంచ్‌లు శ్రీనయ్య, మల్లమ్మయాదయ్య, నాయకులు శంకర్‌, ఖలీల్‌, బాలస్వామి, సుక్కమ్మ, సంజీవ, భాస్కర్‌, రమేశ్‌నాయక్‌ పాల్గొన్నారు. నేడు నగరంలోని నిర్వహించే ద్వి దశాబ్ది ప్లీనరీకి టీఆర్‌ఎస్‌ శ్రేణులు కదలాలని కడ్తాల మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కంబాల పరమేశ్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. కడ్తాలలో జడ్పీటీసీ నివాసంలో మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. నేటి ప్లీనరీ, నవంబర్‌ 15న నిర్వహించే విజయగర్జన సభపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నాయకులు గోపాల్‌, బి.శ్రీనివా్‌సరెడ్డి, లాయక్‌అలీ, రామకృష్ణ, జోగు వీరయ్య, చందోజీ, నర్సింహాగౌడ్‌, లోకేశ్‌, లచ్చిరామ్‌, బాలకృష్ణ, చంద్రమౌళి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ విజయగర్జన సభను మాడ్గుల మండలం నుంచి భారీగా తరలివెళ్లాలని మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ గ్రామసభలను నిర్వహించి ఇప్పటి నుంచే శ్రేణులకు సన్నద్ధం చేయాలన్నారు. అలాగే నేటి ప్లీనరీకి ఆహ్వానం ఉన్న మండల నాయకులు తరలిరావాలన్నారు. మాడ్గుల సర్పంచ్‌ జంగయ్యగౌడ్‌, మాజీ జడ్పీటీసీ పి.రవి, మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్‌, సుభాస్‌, పి.నారాయణరెడ్డి, యాదయ్యగౌడ్‌, చెలమందగౌడ్‌, రాజవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగు లేదని, మరో 20ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని టీఆర్‌ఎస్‌ తలకొండపల్లి మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్‌, జిల్లా నాయకుడు శ్రీనివాస్‌యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కార్యకర్తల సమావేశంలో విజయగర్జనసభపై చర్చించారు. దశరథ్‌నాయక్‌, పద్మనర్సింహ, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:18:17+05:30 IST