ఉద్యమబాటన ఉద్యోగులు

Dec 7 2021 @ 23:35PM
తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ అధికారులు

జేఏసీ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు 

దశల వారీ ఉద్యమాలకు సిద్ధం

రోడ్డెక్కిన చిరు ఉద్యోగులు మొదలు అధికారులు

న్యాయమైన కోర్కెలు ఫలించలేదని ఉద్యోగులు ఉద్యమబాటను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా పీఆర్‌సీ, డీఏల అమలు సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం అధికారులు సైతం ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగులపట్ల సవతి తల్లిప్రేమ చూపుతోందని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. న్యాయమైన 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దశలవారీగా ఆందోళనలు చేపడుతున్నారు. 10వ తేదీ వరకూ ప్రభుత్వం స్పందించకుంటే తాలుక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమించేందుకు జేఏసీ సిద్ధమైందని ఎన్జీఓ సంఘ నేతలు ఆవుల శ్రీనివాసులు, నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివరాల్లోకెళితే....

బద్వేలు/గోపవరం/పోరుమామిళ్ల/బి.కోడూరు/ మైదుకూరు/వేంపల్లె,డిసెంబరు 7: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ తాలూ కా చైర్మన్‌ ఆవుల శ్రీనివాసరావు, కన్వీనర్‌ నరసింహారెడ్డి మాట్లాడారు. గోపవరం తహసీల్దార్‌ కార్యాలయం అధికారులు, సిబ్బంది సహా అన్ని వర్గాల ఉద్యోగులు నిరసన చేపట్టారు. రాచాయపేట జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు భోజ న విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటరమణ, ఆర్‌ఐ నాగేశ్వరి, సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీప్రసన్న, సర్వేయర్‌ శివకుమార్‌, జూ నియర్‌ అసిస్టెంట్‌ సతీష్‌, ఉపాధ్యాయులు, రెవె న్యూ సిబ్బంది పాల్గొన్నారు. పోరుమామిళ్ల ప్రభు త్వ ఉన్నత పాఠశాల, వెంకటాపురం జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శివప్రసాద్‌, ఉపాధ్యాయులు ఉదయ్‌గిరి వీరశేఖర్‌, కొడాలి కృష్ణకాంత్‌, సరస్వతి, సునీత, ఆదిత్యబాయి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏపీ ఎన్జీఓ గౌరవాధ్యక్షుడు సాధు వెంకటేశ్వర్లు, కోశాధికారి అమర్‌నాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిరసన తెలిపారు. బి.కోడూరు తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మధురవాణి, వైద్యాధికారి వర్థన్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఓ నరసింహారెడ్డి, రఘురాములు, విలియమ్‌, డేవిడ్‌, పుల్లయ్య, తదతరులు పాల్గొన్నారు.

మైదుకూరు జడ్పీ హైస్కూల్‌లో జరిగిన కార్యక్ర మంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రవికుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాధి క్‌,  ఖాజామొహిద్దిన్‌, సూర్యనారాయణరెడ్డి, నరసిం హారాజు, ఓబులేసు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నా రు. వేంపల్లె మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకం గా పలు పాఠశాలల వద్ద మధ్యాహ్నం ఉపాధ్యా యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎస్టీయూ రాష్ట్ర నేతలు నరసింహారెడ్డి, సంగమేశ్వర రెడ్డి పాల్గొన్నారు. జడ్పీ బాలుర, బాలికల, ఉర్దూ, తాళ్లపల్లె తదితర హైస్కూళ్లలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.

ఉర్దూ హైస్కూల్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ నేతలు


పోరుమామిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.