సమస్యల పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

ABN , First Publish Date - 2022-05-18T04:58:36+05:30 IST

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం మొండి వైఖరి విడనాడకపోతే ఉద్యమం తప్పదని ఫ్యాప్టో నేతలు పి.రమణారెడ్డి, ఎస్‌.జాబీర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సమస్యల పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు
నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో నేతలు

స్పాట్‌ కేంద్రం వద్ద ఫ్యాప్టో నిరసన 

కడప(ఎడ్యుకేషన్‌), మే 17: ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం మొండి వైఖరి విడనాడకపోతే ఉద్యమం తప్పదని ఫ్యాప్టో నేతలు పి.రమణారెడ్డి, ఎస్‌.జాబీర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో టెన్త్‌ స్పాట్‌ కేంద్రం (కడప మున్సిపల్‌ హైస్కూల్‌) వద్ద నిరసన చేపట్టిన వారు మాట్లాడుతూ అధికారంలో కి వచ్చిన వారంలో సీపీఎ్‌సను రద్దు చేసి, ఓపీఎ్‌సను అమలు చేస్తామని చేసిన వాగ్దా నం, మూడేళ్లవుతున్నా అమలుకు నోచుకోకపోవడం అన్యాయమన్నారు.

ఓపీఎస్‌ మిన హా జీపీఎస్‌ లాంటి ఏ ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు లక్ష్మీరాజ, గురుకుమార్‌, ఇలియాస్‌ బాష మాట్లాడారు. కార్యక్రమంలో ఫ్యా ప్టో నేతలు రామసుబ్బయ్య, సునీల్‌కుమార్‌, హరిప్రసాద్‌, రామసుబ్బయ్య, విజయకుమార్‌, రవిశంకర్‌రెడ్డి, మహబూబ్‌బాష, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T04:58:36+05:30 IST