ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎంపీ అర్వింద్‌

ABN , First Publish Date - 2021-03-07T05:07:56+05:30 IST

భీమ్‌గల్‌ మండలంలోని బాబాపూర్‌ శివారులో ఎండిపోయిన పంట పొలాలను శనివారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు అందకపోవడం వల్లనే పంట పొలాలు ఎండిపోతున్నాయని, పంట పొలాలకు నీరందించడానికి కాళేశ్వరం ప్రా జెక్టును నిర్మించినప్పటికీ ఈ ప్రాంతానికి నీరు అందలేదన్నారు.

ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎంపీ అర్వింద్‌
ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఎంపీ అర్వింద్‌

భీమ్‌గల్‌/కమ్మర్‌పల్లి, మార్చి 6: భీమ్‌గల్‌ మండలంలోని బాబాపూర్‌ శివారులో ఎండిపోయిన పంట పొలాలను శనివారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు అందకపోవడం వల్లనే పంట పొలాలు ఎండిపోతున్నాయని, పంట పొలాలకు నీరందించడానికి కాళేశ్వరం ప్రా జెక్టును నిర్మించినప్పటికీ ఈ ప్రాంతానికి నీరు అందలేదన్నారు. పంట నష్టపోయి న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాల్కొం డ నియోజకవర్గంలో బీజేపీలో ఎవరు చేరినా మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ మ్మ నాయకత్వంలో పనిచేయాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవ ర్గంలో అన్నపూర్ణమ్మ సహకారంతోనే తనకు భారీ మెజారిటీ వచ్చిందన్నారు. రా బోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం ఉన్నవారే బాల్కొండ బీజేపీ అభ్యర్థి అని, వేరేవారెవరికీ చోటు ఉండదని అన్నారు. అనంతరం ఆయన కమ్మర్‌ పల్లి మండలం హసాకొత్తూర్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కోట్పా యాక్ట్‌ వల్ల బీడీ కార్మికులకు ఇబ్బందులు ఉండవ న్నారు. కమ్మర్‌పల్లిలో లోకమాన్య తిలక్‌ రైలు హాల్ట్‌ కోసం ప్రజల నుంచి స్పందన రావాలన్నారు. దరఖాస్తు అందజేస్తే ప్రయత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజే పీ నాయకులు డాక్టర్‌ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, జీవీ నర్సింహరెడ్డి, నిమ్మల శ్రీనివా స్‌, రుయ్యాడి రాజేశ్వర్‌, స్థానిక నాయకులు మహిపాల్‌, హకీం, మూడెడ్ల దేవిదా స్‌, సంధ్యరాజు, కొట్టాల అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:07:56+05:30 IST