ఈ పేలుళ్లు జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తరచూ నదిలో పేలుళ్లు సంభవిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షిప్రా నదికి సంబంధించిన త్రివేణి ఘాట్ వద్ద పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయని, గడచిన ఐదురోజుల్లో నాలుగైదుసార్లు పేలుళ్లు చోటుచేసుకున్నాయన్నారు. ఈ విషయమై జియోలాజకల్ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశానన్నారు. అయితే భూగర్భ శాస్త్రవేత్తలు... భూమిలోపల మార్పుల కారణంగానే ఈ విధమైన పేలుళ్లు సంభవిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘ఇండియా స్పెషల్’ సౌజన్యంతో...