Mp Arvind: కేసీఆర్ కావాలా..? మోదీ కావాలా?.. ప్రశ్నలకు సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-08-27T23:02:43+05:30 IST

సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3వ విడత పాదయాత్రను బండి సంజయ్..

Mp Arvind: కేసీఆర్ కావాలా..? మోదీ కావాలా?.. ప్రశ్నలకు సూటి ప్రశ్న

నిజామాబాద్ (Nizamabad): సీఎం కేసీఆర్ (Cm Kcr) ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3వ విడత పాదయాత్రను బండి సంజయ్ (Bandi Sanjay) దిగ్విజయంగా పూర్తి చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Mp Darmapuri Arvind) అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ (Bjp) ఎదుగుదలను ఆపలేరని ఓ ప్రకటనలో ఆయన హెచ్చరించారు.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణ‌ (Telangana)ను కాషాయ చేయడం తధ్యమన్నారు. ‘‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోని కేసీఆర్ కావాలా..? ఫసల్ బీమా యోజన అమలు చేస్తున్న ప్రధాని మోదీ (Pm Modi) కావాలా?, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మోదీ కావాలా...? కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ కావాలా...?,. నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ కావాలా?... మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ఇస్తున్న మోదీ కావాలా..?. అవినీతి జాతిపిత కేసీఆర్ కావాలా..? అవినీతి రహితంగా పాలన చేస్తున్న మోదీ కావాలా?. కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంటి కేడీ కావాలా...? దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్న మోదీ కావాలా..? అని ప్రజలను అర్వింద్ ప్రశ్నించారు.  

Updated Date - 2022-08-27T23:02:43+05:30 IST