girl తుపాకులు పట్టుకొని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది...ఆ తర్వాత ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-03-07T15:22:11+05:30 IST

ఓ యువతి తుపాకీని చేత బట్టుకొని ఫొటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటన...

girl తుపాకులు పట్టుకొని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది...ఆ తర్వాత ఏమైందంటే...

భోపాల్ : ఓ యువతి తుపాకీని చేత బట్టుకొని ఫొటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో వెలుగుచూసింది.ఉజ్జయిని నగరంలోని పావాసా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఓ చేతిలో పిస్టల్, మరో చేతిలో కంట్రోమేడ్ గన్‌తో ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ ఫొటోను చూసిన ఉజ్జయిని పోలీసులు యువతి కోసం గాలించి చివరకు పట్టుకున్నారు. అక్రమంగా ఆయుధాలు ఉంచుకోవడమే కాకుండా, తుపాకులతో ఫొటోకు ఫోజులిచ్చి ప్రజలను భయపెట్టేందుకు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.



తుపాకులతో సమాజంలో భయభ్రాంతులు సృష్టించేందుకు యత్నించిన యువతిపై ఆయుధాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్టు చేశామని పోలీసులు  చెప్పారు.అరెస్టు చేసిన యువతిని సోమవారం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు వివరించారు.

Updated Date - 2022-03-07T15:22:11+05:30 IST