MP Gorantla: వ్యవహారంపై ఫిర్యాదుకు రాష్ట్రపతి కార్యాలయం స్పందన

ABN , First Publish Date - 2022-08-30T19:47:41+05:30 IST

ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై మహిళా నేతలు చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

MP Gorantla: వ్యవహారంపై ఫిర్యాదుకు రాష్ట్రపతి కార్యాలయం స్పందన

అమరావతి (Amaravathi): ఎంపీ గోరంట్ల (MP Gorantla) వీడియో (Video) వ్యవహారంపై మహిళా నేతలు చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి  కార్యాలయం స్పందించింది. తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్‌ (AP CS)కు పంపించింది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై మహిళా సంఘాలు, విపక్షాలు ఆందోళన చేశాయి. వెంటనే ఎంపీ గోరంట్లను పార్టీ, పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. అయినా సీఎం జగన్ (CM Jagan) ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళా సంఘాలు కలిసి ఈ నెల 21న ఢిల్లీలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు మహిళా నేతల ఫిర్యాదును ఏపీ సీఎస్‌కు పంపింది. 

Updated Date - 2022-08-30T19:47:41+05:30 IST