AP News: ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయాలి: సౌమ్య

ABN , First Publish Date - 2022-08-05T21:39:37+05:30 IST

Amaravathi: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (YCP MP Gorantla Madhav)ను సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (EX MLA Tangirala Sowmya) డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌

AP News: ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయాలి: సౌమ్య

Amaravathi: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (YCP MP Gorantla Madhav)ను సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (EX MLA Tangirala Sowmya) డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఉదయమే ఈ వీడియో సోషల్‌ మీడియా (Social media)లో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ‘వైరల్‌’గా మారింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్‌ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా చేయడం ఏమిటని సౌమ్య ప్రశ్నించారు. గోరంట్ల తీరు చూశాక వైసీపీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విధంగానే ఉంటారా? అనే అనుమానం కలుగుతోందన్నారు.  

Updated Date - 2022-08-05T21:39:37+05:30 IST