Mp Gorantla madhav Video పాపం వెన్నాడుతూనే ఉంటుందా?

ABN , First Publish Date - 2022-08-19T01:47:58+05:30 IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) వీడియోపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ తాజాగా (AP CID) వివరణ ఇచ్చింది. ఏపీ సీఐడీ...

Mp Gorantla madhav Video పాపం వెన్నాడుతూనే ఉంటుందా?

అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) వీడియోపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ తాజాగా (AP CID) వివరణ ఇచ్చింది. ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ (DG Sunil Kumar) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ మాధవ్ వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను.. ల్యాబ్కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు. వీడియోలో ఉన్న కంటెంట్ వాస్తవమా?.. కాదా?.. అనే విషయం ఆ ల్యాబ్ చెప్పలేదని డీజీ సునీల్ కుమార్ అన్నారు.


ఆ వీడియో మార్ఫింగ్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారని డీజీ సునీల్ కుమార్ తెలిపారు. ఎక్లిప్స్ ల్యాబ్ పేరుతో కొందరు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలిందన్నారు. ఎక్లిప్స్ సంస్థకి చెందిన జిమ్ స్టాఫర్డ్ పేరుతో తిరుగుతున్న నివేదిక తనది కాదని స్టాఫర్డ్ తనకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారన్నారు. సర్కులేషన్లో ఉన్న వీడియో ఒరిజనలేనని మాత్రమే ఎక్లిప్స్ సంస్థ చెప్పిందన్నారు. ఓ స్క్రీన్ మీద రన్ అవుతోందన్న దాన్ని తీసిన వీడియో చూసి రియలా..? ఫేకా..? అనేది ఎవ్వరూ తేల్చరన్నారు. ఒరిజనల్ ఫుటేజ్ ఉంటేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయని జిమ్ స్టాఫర్డ్ కూడా చెప్పారన్నారు. ఫేక్ డాక్యుమెంట్ సర్కులేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. ప్రసాద్ పోతిని సహా తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఐటీ యాక్ట్ 67 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. 


ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వీడియో పాపం వెన్నాడుతూనే ఉంటుందా?. నన్ను వదిలేయండంటున్న మాధవ్‌ను జగన్ ప్రభుత్వం వదలదా?. అది ఫేక్ వీడియో అన్న ప్రభుత్వం ఫోరెన్సిక్ రిపోర్టులు కూడా ఫేక్ అని ఎందుకంటోంది?. మహిళల డిమాండ్‌ను పట్టించుకోని ప్రభుత్వం ఆరోపణలకే ఎందుకు స్పందిస్తోంది?. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సడెన్‌గా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు?. ఎవరి ఫిర్యాదు మేరకు అమెరికా ఫోరెన్సిక్ నివేదికపై ఆరా తీశారు?. వీడియోపై సుమోటోగా ఎందుకు విచారణ జరపలేకపోతున్నాం.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-08-19T01:47:58+05:30 IST