Gorantla madhav Video: జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. ఏపీ డీజీపీకి లేఖ

ABN , First Publish Date - 2022-08-12T00:23:20+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Mp Gorantla Madhav Video)పై జాతీయ మహిళా కమిషన్‎ (National Commission Of Women)కు ఫిర్యాదు అందింది. దీనికి..

Gorantla madhav Video: జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. ఏపీ డీజీపీకి లేఖ

న్యూఢిల్లీ: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Mp Gorantla Madhav Video)పై జాతీయ మహిళా కమిషన్‎ (National Commission Of Women)కు ఫిర్యాదు అందింది. దీనికి తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Lokh Sabha Speaker Om Birla)కు కమిషన్ లేఖ రాసింది. అలాగే స్వంతంత్ర దర్యాప్తు జరిపించి వీలైనంత త్వరగా కమిషన్‎కు నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ (Ap Dgp)కి ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖ శర్మ లేఖా రాశారు.


అటు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ప్రధాని మోదీ (Pm Modi) దృష్టికి కూడా వెళ్లింది. ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ (Mp Jasbir Singh Gill) మోదీకి లేఖ రాశారు. గోరంట్ల(YCP MP) వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఆయన లేఖలో తెలిపారు. పార్లమెంట్ ఎంపీలకు మాయని మచ్చలా ఉందని.. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని అని లేఖలో తెలిపారు. 




Updated Date - 2022-08-12T00:23:20+05:30 IST