మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సదుపాయం: ఎంపీ GVL

ABN , First Publish Date - 2022-06-28T20:08:23+05:30 IST

దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే విడిగా ఫిషరీస్ మినీస్ట్రీని ఏర్పాటు చేసిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సదుపాయం: ఎంపీ GVL

విశాఖపట్నం: దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే విడిగా ఫిషరీస్ మినిస్ట్రీని ఏర్పాటు చేసిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL narasimaha rao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.... మత్స్యసంపద యోజన కింద కోల్ట్ స్టోరేజి, మార్కెటింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతిజిల్లాలో మత్స్యమార్కెట్ కమిటీలు ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్‌లో సర్వైలెన్స్ కెమెరాలు, పోలీస్ సబ్ పోస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారని, ప్రతిఒక్కరికీ రుణసదుపాయం అందేలా బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. మత్స్యకారులు వెనుక బడినవర్గంలో ఉన్నారని... ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్ కూడా ఉందన్నారు. సముద్ర కాలుష్య సమస్య మీద కూడా దృష్టిపెడతామమని ఎంపీ జీవీఎల్ వెల్లడించారు. 


Updated Date - 2022-06-28T20:08:23+05:30 IST