
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడి దగ్గర కూడా నీచ రాజకీయాలుచేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి పునఃప్రారంభంలో సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదని ఆయన ఆరోపించారు.స్థానిక ఎంపీగా నన్ను పునఃప్రారంభానికి పిలవలేదని కోమటి రెడ్డి ఆరోపించారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించడం శోచనీయమన్నారు. తాను కాంగ్రెస్ ఎంపీ కావడం వల్లనే కేసీఆర్ తనను యాదాద్రి పున: ప్రారంభోత్సవ వేడులకు ఆహ్వానించ లేదని అన్నారు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.