
నల్గొండ: అవినీతి బయట పడుతుందనే భయంతో కేసీఆర్ మోదీకి సరెండర్ అయ్యారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్‌కు జైలుకు వెళ్తాననే భయం పట్టుకుందన్నారు. కేంద్రం మెడలు వంచుతానని మోదీ దగ్గర మోకరిల్లాడని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు.