కులాల మధ్య చిచ్చు పెడుతున్న ఎంపీ మాధవ్‌: టీడీపీ

ABN , First Publish Date - 2022-08-09T05:29:15+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధ వ్‌పై సభ్య సమాజం తలదించుకునేలా వీడియో లు రావడంతో చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడని రాష్ట్ర కు రుబ కార్పొరేషన మాజీ చైర్‌పర్సన, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత విమర్శించారు.

కులాల మధ్య చిచ్చు పెడుతున్న ఎంపీ మాధవ్‌: టీడీపీ
మాట్లాడుతున్న సవిత

పెనుకొండ, ఆగస్టు 8: ఎంపీ గోరంట్ల మాధ వ్‌పై సభ్య సమాజం తలదించుకునేలా వీడియో లు రావడంతో చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడని రాష్ట్ర కు రుబ కార్పొరేషన మాజీ చైర్‌పర్సన, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత విమర్శించారు. సోమవారం ఆమె స్థానికంగా విలేకరులతో మా ట్లాడారు. వైసీపీ ఎంపీ చేసిన పనులకు తెలుగుదే శం పార్టీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేశను విమర్శించడం మంచిది కాదన్నారు. కు రుబ కులం అంటేనే నీతి, నిజాయితీ, ధైర్యానికి మారుపేరని అన్నారు. అటువంటి కులంలో పుట్టి సభ్యసమాజం తలదించుకునేలా న్యూడ్‌ వీడియో, మహిళతో అసభ్యకరంగా మాట్లాడటం మచ్చ తెస్తోందన్నారు. ఈ వికృత చేష్టలు కులానికే కాదు... యావత దేశానికి చెడ్డపేరుతెచ్చేలా ఉందన్నారు. గతంలో కురుబ కులస్తులు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశలో చా లా మంది ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు, గవర్నర్‌లుగా పనిచేశారన్నారు. 


మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారకరామారావు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మా నాన్నగారు కురుబ రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి, అనంతరం 14 శాఖల మం త్రిగా కేటాయించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఏ కులానికి దక్కని గౌరవం కురుబల కులానికి ద క్కిందన్నారు. ఇది కురుబలకు గర్వకారణమన్నా రు. వారెవరూ ఇతర కులాలను దూషించిన దాఖ లాలు లేవన్నారు. నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని ఎంపీ మాధవ్‌కు హితవుపలికారు. చేతనైతే విచారణ జరుపుకుని, ఆ వీడియో తనది కాదని నిరూపించుకోవాలి కానీ, కులాల మధ్య చిచ్చుపెట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. 


Updated Date - 2022-08-09T05:29:15+05:30 IST