Mp Madhav Video: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-08-11T23:08:57+05:30 IST

ఎస్పీ ఫకీరప్ప (Sp Pakirappa)కు ఆగస్టు 15న గోల్డ్ మెడల్‌ (Gold Medal) ఇస్తే బాగుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Cpi Ap Secretary Ramakrishna)అన్నారు....

Mp Madhav Video: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి: రామకృష్ణ

అనంతపురం: ఎస్పీ ఫకీరప్ప (Sp Pakirappa)కు ఆగస్టు 15న గోల్డ్ మెడల్‌ (Gold Medal) ఇస్తే బాగుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Cpi  Ap Secretary Ramakrishna)అన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఎటూ తేల్చలేక ఫకీరప్ప చేతులెత్తేశారని ఆయన ఎద్దేవా చేశారు. మాధవ్ వీడియోను హోమ్‌ మంత్రి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని చెబితే.. ఎస్పీ మాత్రం పంపలేదని చెప్పి గందరగోళానికి గురి చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. తన వీడియోను మార్ఫింగ్‌ చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మాధవ్ ఫిర్యాదు ఇచ్చారని.. కానీ తమకు ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్పీ చెప్పడం విడ్డురమన్నారు. ఎస్పీ ఫకీరప్ప దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని విమర్శించారు. ఈ విషయంలో ఆగస్టు 15న ఆయనకు గోల్డ్‌ మెడల్ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2022-08-11T23:08:57+05:30 IST