టీడీపీ మద్దతుతో వైసీపీ రెబల్‌కు ఎంపీపీ పీఠం

Sep 25 2021 @ 01:21AM
బొండ వరహాలమ్మ ఎంపీపీ


పాడేరు(పెదబయలు): పెదబయలులో ఎంపీపీ ఎన్నికలో అధికార వైసీపీకి పరాభవం తప్పలేదు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో వైసీపీ రెబల్‌ అభ్యర్థిని బొండా వరహాలమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. పెదబయలు మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు అధికార వైసీపీకి పది, టీడీపీకి ఐదు ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. దీంతో ఎంపీపీ పదవి మెజార్టీ వైసీపీకే దక్కాలి. అయితే ఎంపీపీ స్థానానికి వైసీపీ నుంచి గంపరాయి ఎంపీటీసీ సభ్యురాలు బొండ వరహాలమ్మ, కిముడుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వంతాల కాసులమ్మ పోటీ పడ్డారు. కాని వైసీపీ బి-ఫారం కాసులమ్మకు ఇవ్వడంతో వరహాలమ్మ వైసీపీ రెబల్‌గా ఎంపీపీ బరిలో నిలిచారు. ఎంపీపీ పోటీలో ఉన్న వైసీపీ రెబల్‌ అభ్యర్థిని బొండ వరహాలమ్మకు టీడీపీ ఎంపీటీసీ సభ్యులతోపాటు వైసీపీకి చెందిన పాంగి నిర్మల(గిన్నెలకోట), పొయిభా పూర్ణారావు(కొరవంగి) మద్దతు తెలిపారు. అలాగే వైసీపీ అభ్యర్థిని వంతాల కాసులమ్మకు వంతాల ఆనందరావు(సీకరి), కొర్రా రాజబాబు(అరడకోట), పాంగి అప్పారావు(పెదకోడాపల్లి), కోరాబు జ్యోతి(కుంతుర్ల), వంటారి సంగీత(రూడకోట)మద్దతు తెలిపారు. దీంతో వైసీపీ రెబల్‌ అభ్యర్థిని బొండ వరహాలమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అలాగే వైస్‌ఎంపీపీగా టీడీపీ సభ్యురాలు పాంగి సోనే, కోఆప్షన్‌ సభ్యుడుగా షేక్‌ అబ్ధుల్లాను ఎన్నుకున్నారు.   


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.