Viral Video: ప్రియుడి ఇంట్లో ఉంటూ భర్తకు దొరికిపోయిన భార్య.. గ్రామస్తులు ఆమెకు విధించిన దారుణ శిక్ష ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-06T01:51:14+05:30 IST

భర్త ఉండగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఓ గిరిజన మహిళపై కొందరు వ్యక్తులు అమానవీయంగా దాడి చేశారు.

Viral Video: ప్రియుడి ఇంట్లో ఉంటూ భర్తకు దొరికిపోయిన భార్య.. గ్రామస్తులు ఆమెకు విధించిన దారుణ శిక్ష ఏంటంటే..

భర్త ఉండగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఓ గిరిజన మహిళపై కొందరు వ్యక్తులు అమానవీయంగా దాడి చేశారు. ప్రియుడి ఇంటి నుంచి బయటకు లాగి చితకబాదారు. ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. అంతేకాదు భర్తను భుజాలపై మోస్తూ గ్రామమంతా తిరగాలని శిక్ష విధించారు. మధ్యప్రదేశ్‌​లోని దేవాస్​ జిల్లాలోని బోర్పాడవ్ గ్రామంలో ఆదివారం ఈ దారుణ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య ఫిర్యాదు.. కంగారుగా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆమె ఫోన్‌కాల్ డేటాను చెక్ చేస్తే..


బోర్పాడవ్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ అదే గ్రామానికి చెందిన హరి సింగ్​ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గత నెల 24న రహస్యంగా ప్రియుడి ఇంటికి వెళ్లి అక్కడే ఉండిపోయింది. భార్య కనిపించకపోవడంతో భర్త మంగీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కూడా ఆమె ఆచూకీ దొరకలేదు. చివరకు ఆదివారం హరి సింగ్ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ కనిపించింది. గ్రామ పెద్దలకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరినీ ఇంట్లో నుంచి బయటకు లాగి చితకబాదారు. బాధితురాలి బట్టలు చింపేసి కొట్టారు. 


అంతేకాదు, భర్తను భుజాలపై మోస్తూ గ్రామమంతా తిరగాలని బాధితురాలికి శిక్ష విధించారు. దగ్గరుండి ఆమె చేత భర్తను మోయించారు. అనంతరం ఆమెకు, హరి సింగ్‌కు చెప్పులదండ వేసి చితకబాదారు. ఆ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హరి సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే తొమ్మిదిమంది నిందితులను అరెస్టు చేశారు. . ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.



Updated Date - 2022-07-06T01:51:14+05:30 IST