కాశ్మీర్ ఫైల్స్‌లా.. కాకాణి ఫైల్స్ సినిమా తీయొచ్చు: రఘురామ

ABN , First Publish Date - 2022-04-18T21:27:07+05:30 IST

కాశ్మీర్ ఫైల్స్‌లా.. కాకాణి ఫైల్స్ సినిమా తీయొచ్చునని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

కాశ్మీర్ ఫైల్స్‌లా.. కాకాణి ఫైల్స్ సినిమా తీయొచ్చు: రఘురామ

న్యూఢిల్లీ: కాశ్మీర్ ఫైల్స్‌లా.. కాకాణి ఫైల్స్ సినిమా తీయొచ్చునని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మంత్రి గోవర్థన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ నెల్లూరు కోర్టులో చోరీపై ఎస్పీ కుక్క కథ బాగా చెప్పారని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు నీటిపారుదల మంత్రా? నోటిపారుదల మంత్రా? అని ప్రశ్నించారు. గతంలో మంత్రి పదవి లేకపోయినా.. నోటి పారుదల ఉండేదన్నారు.


పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో సీఎం జగన్, మంత్రి చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు. మంత్రి కాకాణి రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. 21 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేలా చూడాలన్నారు. విజయసాయిని విశాఖకు దూరం చేస్తున్నారని తెలిసిందన్నారు. సాయిరెడ్డి తిరుపతికి వెళ్తే పార్టీ నేతలు ఎవరు కూడా.. పట్టించుకోవద్దని చెప్పినట్టు తెలిసిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-18T21:27:07+05:30 IST