Dirty video.. నాలుగు గోడల మధ్య జరిగితే.. మరి ఆ వీడియో ఎవరు లీక్ చేశారు?: రఘురామ

ABN , First Publish Date - 2022-08-09T20:40:13+05:30 IST

డర్టీ వీడియో విషయంలో సజ్జల విశాల హృదయాన్ని చాటుకున్నారని ఎంపీ రఘురామ అన్నారు.

Dirty video.. నాలుగు గోడల మధ్య జరిగితే.. మరి ఆ వీడియో ఎవరు లీక్ చేశారు?: రఘురామ

ఢిల్లీ (Delhi): ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) డర్టీ వీడియో (Dirty video) విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) విశాల హృదయాన్ని చాటుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) అన్నారు. గోరంట్ల వ్యవహారం నాలుగు గోడల మధ్య జరిగిందని అన్నారు... మరి వీడియోను ఎవరు లీక్ చేసి ఉంటారని ప్రశ్నించారు.


టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ వచ్చి.. ప్రధానమంత్రి మోదీ (Modi)ని కలిశారని... వారు కలవడాన్ని చూసి నొచ్చుకోవడం ఎందుకని రఘురామ అన్నారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసే ఉన్నారని, బీజేపీ టీడీపీతో కలిస్తే మనకెందుకన్నారు. బీజేపీతో టీడీపీ  తెలంగాణలో కలిసి ముందుకు వెళ్తే హైద్రారాబాద్‌లో 25 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ ఉన్నారన్నారు. నాన్ ఐఏఎస్ క్యాడర్ వారిని ఏపీ రాష్టానికి తీసుకొచ్చి పోస్టులు ఇస్తున్నారని, సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.


Updated Date - 2022-08-09T20:40:13+05:30 IST