MP Raghurama: లిక్కర్ వ్యాపారంలో సూత్రధారులు... పాత్రధారులు వారే..

ABN , First Publish Date - 2022-09-07T21:56:08+05:30 IST

లిక్కర్ వ్యాపారంలో సూత్రధారులు... పాత్రధారులు.. వారేనని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.

MP Raghurama: లిక్కర్ వ్యాపారంలో సూత్రధారులు... పాత్రధారులు వారే..

ఢిల్లీ (Delhi): లిక్కర్ వ్యాపారంలో సూత్రధారులు... పాత్రధారులు.. రోహిత్ రెడ్డి (Rohit Reddy), పినాక శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy), విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అల్లుడు ఉన్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆడాన్ డిస్లరీ (Audan Dislery) అతిపెద్ద పెట్టుబడితో ప్రారంభించారన్నారు. ఏపీ బేవరైజేషన్ కార్పొరేషన్ వాసుదేవా రెడ్డి అనే జూనియర్ అధికారిని తీసుకొచ్చారన్నారు. అన్న క్యాంటీన్ కడపలో కూల్చేశారని, మరి అదే చంద్రబాబు (Chandrababu) ఇచ్చిన డిస్లరీని కూల్చేయవచ్చు కదా?.. కూల్చారు ఎందుకంటే డబ్బులు వస్తాయి కాబట్టి... ఏపీలో ఉన్న బ్రాండ్స్ వేరే ఊర్లో ఎందుకు ఉండవని ప్రశ్నించారు.


ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని, ఢిల్లీ లిక్కర్ షాపులకు రూ. 200 కోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చారని రఘురామ అన్నారు. రూ. 2 వందల కోట్లు ఆడాన్ డిస్లరీకి బ్యాంకు గ్యారెంటీ ఎలా ఇచ్చారు?.. ఎవరు ఇచ్చారన్నారు. సృజన్ రెడ్డి, సాయిరెడ్డికి ఆప్తుడని, ఆయనపై రైడ్ అయిందన్నారు. ఈ విషయం  సాక్షిలో మాత్రం రాయలేదన్నారు. లేబుల్ నుంచి, సరఫరా, అమ్మకాల వరకు పేరున్న రెడ్డి ఒకరు నడుపుతున్నారన్నారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో మూడేళ్ళ నుంచి డిజిటల్ ట్రాన్సక్షన్స్ చేయడం లేదన్నారు. ఢిల్లీ కుంభకోణం ఈరోజు కాకపోయినా రేపు వస్తుందన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని రఘురామ చెప్పారు. ఢిల్లీలో లిక్కర్‌పై సీబీఐ విచారణ అద్బుతంగా జరుగుతోందన్నారు. ఆడాన్ డిస్లరీ ఎవరిది, శివకుమార్ ఎవరన్నది నిగ్గు తేల్చాలన్నారు. ఏపీలో మద్యంపై డిజిటల్ ట్రాన్సక్షన్ చేయడం లేదని, లిక్కర్‌పై వచ్చే క్యాష్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో అన్నిటిపై కేంద్రానికి లేఖ రాస్తానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-07T21:56:08+05:30 IST